తెలంగాణ చేనేత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులుగా ఆడెపు శంకర్.

Rathnakar Darshanala
తెలంగాణ చేనేత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులుగా ఆడెపు శంకర్.

(జేమ్స్ రెడ్డి నేటి వార్త ప్రతినిధి)

జిల్లాలో ఉన్న చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిర్విరామంగా కృషి చేస్తానని పెద్దపల్లి జిల్లా చేనేత ఐక్యవేదిక అధ్యక్షులు ఆడెపు శంకర్ అన్నారు.

జిల్లా అధ్యక్షులు తనను నియమించినందుకు చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ కు అయన కృతజ్ఞతలు తెలిపారు.

రామగుండం కార్పొరేషన్ ఏరియా పద్మశాలి సేవా సంఘం ప్రధాన కార్యదర్శిగా  అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి వివిధ అవార్డులు సొంతం చేసుకొని కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ పద్మశాలి కమ్యూనిటీ భవనం నిర్మాణానికి పాటుపడ్డానని అన్నారు. 

రానున్న రోజుల్లో జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామాన పద్మశాలి జాతి చేనేత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేసి ప్రభుత్వం నుండి రావాల్సిన పథకాలను క్షేత్రస్థాయిలో అమలు జరిగే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. 

తన నియమకానికి సహకరించిన వీర మోహన్ తో పాటు రామగుండం కార్పొరేషన్  పద్మశాలి సేవా సంఘం , 

యువజన,మహీళా సంఘం కుల బాంధవులకు రుణపడి ఉంటానన్నారు. శంకర్ నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
Comments