రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి మార్కెట్ చైర్మన్ ప్రశాంత్

Rathnakar Darshanala
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
     మార్కెట్ చైర్మన్ ప్రశాంత్ 
నేటి వార్త మదనాపురం

 వరి ధాన్యం తూకం లో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మదనాపురం మార్కెట్ చైర్మన్ ప్రశాంత్ అన్నారు, 

మార్కెట్  ఏర్పాటు సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా వరి ధాన్యం కొనుగోలు చేపట్టాలని అదే సమయంలో రైతులకు కావల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని  అన్నారు. 

రైతులు కూడా కొనుగోలు కేంద్రాల్లోనే పంటను అమ్ముకొని ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని సన్న రకం వడ్లకు రూ.500 బోనస్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు, 

ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, వెంకటనారాయణ, అంజద్ అలీ,సత్య శిలా రెడ్డి, ఆవుల రాఘవేంద్ర, చుక్క మహేష్, రవీందర్ రెడ్డి, శంకర్ యాదవ్, మన్యంకొండ, జూరాల రాములు, కోటేష్, వెంకటన్న, తదితరులు పాల్గొన్నారు.
Comments