అంగన్వాడీ విద్యార్థులకు కుర్చీలు వితరణ.

Rathnakar Darshanala
అంగన్వాడీ విద్యార్థులకు కుర్చీలు వితరణ.
నేటి వార్త రాయికల్ అక్టోబర్ 29:

జగిత్యాల క్రెడిట్ ఆక్సిస్ గ్రామీణ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో,రాయికల్ మండలం కిష్టంపేట్ గ్రామం లోని అంగన్వాడీ విద్యార్థులకు కూర్చునేందు కు వీలుగా, కుర్చీలు విరాళంగా అందజేశారు.

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చాలాకాలం నుండి తెలంగాణ లో ఇలాంటి సేవా కార్యక్రమాలును చేపట్టుతున్నామని,

భవిష్యత్తు లో ఇంకా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంస్థ హెడ్ రమేష్ బాబు అంగన్వాడీ సీడీపీఓ మమత,సూపర్ వైజర్ రాధ, 

గ్రామ పంచాయతీ కార్యదర్శి వేణు, మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ సభ్యులు జోగినిపెల్లి తిరుపతి గౌడ్, మాజీ ఉపసర్పంచ్ సత్తయ్య, 

గ్రామీణ ఉపాధి హామీ మెట్ రమేష్, అంగన్వాడీ టీచర్లు దివ్య, అన్నపూర్ణ, క్రెడిట్ ఆక్సిస్  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments