ఎమ్మెల్యేను కలిసిన నూతన పాలకవర్గం.
By
Rathnakar Darshanala
ఎమ్మెల్యేను కలిసిన నూతన పాలకవర్గం.
పెద్దపల్లి అక్టోబర్ 30: నేటి వార్త ప్రతినిధి అడిచర్ల రమేష్.
కాల్వశ్రీ రాంపూర్ మండలంలోని నూతనంగా నియమితులైన వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి,వైస్ చైర్మన్ సబ్బానీ రాజమల్లు నూతన డైరెక్టర్లు బుధవారం రోజున ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని ఎమ్మెల్యే నివాసంలో పెద్దపల్లి ఎమ్మెల్యే సిహెచ్.విజయరమణ రావును మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో ఘనంగా సత్కరించారు.
కాల్వ శ్రీరాంపూర్ వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గంలోకి నియమించిన ఎమ్మెల్యే విజయరమణ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరము ఎమ్మెల్యేకు నూతన చైర్మన్
రామిడి తిరుపతి రెడ్డి,వైస్ చైర్మన్ సబ్బానీ రాజమల్లు పాలకవర్గ సభ్యులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే రైతు సంక్షేమానికి కృషి చేయాలని శ్రీరాంపూర్ మండల వ్యవసాయ మార్కెట్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎం.పీ.పీ.గోపగాని సారయ్య గౌడ్,నూతన డైరెక్టర్లు కలవేని రాజయ్య, దోమ్మటీ రాజయ్య,
కె. మల్లయ్య, ఎనగంటి రవి,సలిగంటి రామచంద్రం, అబ్దుల్ రసూల్,దొబిల్ల సంపత్,కోమల మల్లమ్మ, దగేటి రామచంద్రం,కూనారపు రమేష్,మండల అధ్యక్షులు సదయ్య, మునీర్ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.
Comments