లబ్ధిదారుల ఇంటి వద్దకే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు.

Rathnakar Darshanala
లబ్ధిదారుల ఇంటి వద్దకే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు.

. లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు


పెగడపల్లి అక్టోబర్ 26 నేటి వార్త దినపత్రిక జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని రాములపల్లి, నంచర్ల, దేవి కొండ, 

నందగిరి  గ్రామాలకు చెందిన 93 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 24,73,500 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్, ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు లబ్ధిదారుల వద్దకు వెళ్లి స్థానిక, 

మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో భాగంగా,

 లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఇంటి వద్దకు నేరుగా చెక్కులు పంపిణీ చేయాలనే సంకల్పంతో నేరుగా లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి చెక్కులు ఇవ్వడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్, ఉపాధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చాట్ల విజయభాస్కర్, గోగూరి సతీష్ రెడ్డి, తడగొండ రాజు, బండారి శ్రీనివాస్, కడారి తిరుపతి, 

పూసాల తిరుపతి, సింగసాని స్వామి, ఆకుల విష్ణు, ఇస్లావత్ రవి నాయక్, ఎలగొండ కృష్ణ హరి, చెట్ల కిషన్,  బొడ్డు రమేష్, వంశీధర్ రావు, చాట్ల ప్రశాంత్, ముదిగంటి పవన్ రెడ్డి, స్థానిక గ్రామాల నాయకులు కట్ల సత్తయ్య, కట్ల శ్రీనివాస్, దీకొండ మహేందర్, నీరటి రాజ్ కుమార్, 

అడుప మారుతి, ఎడ్ల శ్యాంసుందర్ రెడ్డి, కొత్త శ్రీనివాస్, కుంటాల అంజయ్య, సుంకరి రవి, పటేల్ సత్యనారాయణ రెడ్డి, అశోక్ రెడ్డి, గాజుల రాకేష్, ధనియాల సురేష్, గర్వంద రమేష్ గౌడ్, సతీష్ గౌడ్, మూల రాంరెడ్డి తడగొండ లక్ష్మణ్, బైర రాజు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు,,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Comments