చలో ఖమ్మం ఎస్సీ వర్గీకరణ సాధనకై కదిలిన మాదిగ దండోరా భీమవరం గ్రామ కమిటీ.

Rathnakar Darshanala
చలో ఖమ్మం ఎస్సీ వర్గీకరణ సాధనకై కదిలిన మాదిగ దండోరా భీమవరం గ్రామ కమిటీ.
అక్టోబర్ 26 నేటి వార్త ప్రతినిది టి. శ్రీనివాస్

1994 జులై 7 న ఒక మారుమూల గ్రామంలో ప్రారంభమైన ఎమ్మార్పీఎస్,గ్రామస్థాయి నుంచి కేంద్రస్థాయి వరకు మాదిగల యొక్క గోడును వినిపించి మాదిగల మరియు దాని ఉపకులాల యొక్క హక్కుల సాధనకై పోరాడుతున్న విషయం మీకు తెలిసినది.

 ఏబిసిడి వర్గీకరణ సాధనకై అలుపెరుగని పోరాటం చేస్తూ మాదిగలు మరి దాని యొక్క ఉప కులాలకు వెలుగునందిస్తున్న మాన్య శ్రీ మందా కృష్ణ అన్న పిలుపుమేరకు మాదిగ దండోరా కమిటీ ఖమ్మంలో కృష్ణ మాదిగను కలిసి తమ యొక్క సంఘీభావాన్ని తెలిపారు.

ఈ కార్యక్రమంలో  శ్రీ మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ వర్గీకరణ ఆపటం ఎవరి తరం కాదని ఆగస్టు 1 సుప్రీంకోర్టు 6 జడ్జీల ధర్మాసనం వర్గీకరణకు అనుకూలంగా తీర్పించినప్పటికీ
దానిని అమలు చేయడంలో చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణ వ్యతిరేక పనిచేస్తున్న శక్తులు కు మాదిగలు అత్యధికంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో వారి ఆటలు ఇంకా ఎంతకాలమో సాగవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో భీమవరం మాదిగ దండోరా కమిటీ సభ్యులు కోట ఫ్రాన్సిస్ మాదిగ సుదిమల్ల ప్రసాదు మాదిగ నంది పాము బాలస్వామి మాదిగ నడ్డి రత్తయ్య మాదిగ నడ్డి ఇశ్రాయేలు మాదిగ బోల్లి పోగు రాము మాదిగ కాటూరి చిన్నదాస్ మాదిగ  మరియు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు...
Comments