సహాయం కోసం ఎదురుచూపు.

Rathnakar Darshanala
సహాయం కోసం ఎదురుచూపు.
 *-దంత వైద్య విద్యార్థికి నందిని..* 
నేటివార్త,సింగరేణి(అక్టోబర్ 28):

ఖమ్మం జిల్లా,సింగరేణి మండలం ,కొత్తతండ గ్రామ పంచాయతీకి చెందిన బదావత్ చిన్నా పెద్ద కుమార్తె అయిన బదావత్ నందిని వైద్య విద్య ప్రవేశాలలో నార్కెట్ పల్లి ,

కామినేని వైద్య కళాశలలో సీటు పొందినారు.చిన్నతనం నుంచి చదువుల్లో చురుకుగా ఉండే నందిని తన పాఠశాల విద్య DAV స్కూల్  మాదారంలో మరియు తన కళాశాల విద్య కృష్ణవేణి జూనియర్ కళాశాల కొత్తగూడెంలో పూర్తిచేసింది. 

దంత వైద్య కళాశాలో అడ్మిషన్ ఫీజు మరియు హాస్టల్ ఫీజు కట్టే స్తోమత తన తండ్రికి లేనందున అడ్మిషన్ కాన్సిల్ అయ్యి ,చదువుకు దూరం అయ్యే  పరిస్థితిలో వున్నారు.

కావున జిల్లాలోని,మండలంలోని మేధావులు, విద్యావేత్తలు ,రాజకీయ నాయకులు ,దాతలు ఎవరైనా ఆదరిస్తే తను మంచి దంత వైద్యురాలై సమాజానికి సేవ చేస్తానని తను ఆవశ భావాన్ని వ్యక్తపరచడం జరిగినది. 

దయ తలచి ఈ పేద విద్యార్థిని ఆదుకొని తన చదువుకు సహకారం అందించాలనుకున్నవారు.బదావత్  చిన్నా తండ్రి రాంచంద్ mobile number...9502499606 కు సంప్రదించగలరు.పేదరికంలో ఉన్న ఈ పేద విద్యార్థిని వైద్య విద్య ముందుకు సాగాలని కోరుచున్నారు.
Comments