భయభ్రాంతులకు గురి చేసే కూల్చివేతలను ఆపండి...!
By
Rathnakar Darshanala
భయభ్రాంతులకు గురి చేసే కూల్చివేతలను ఆపండి...!
అభివృద్ధికి ఆటంకం కాదు... చిరు వ్యాపారులకు అండగా ఉంటాం... మాజీ ఎమ్మెల్యే కోరుకంటి
(జేమ్స్ రెడ్డి నేటి వార్త ప్రతినిధి)
భయభ్రాంతులకు గురిచేసే కూల్చివేతలను ఆపివేయాలని, చిరు వ్యాపారులకు అండగా నిలవాలని BRS పార్టీ రామగుండం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,
పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. ఈ సందర్బంగా గోదావరిఖని BRS పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...
అభివృద్ధికి మేము ఎప్పుడు ఆటంకం కాదని, ఈ రోడ్డు వెడల్పుతో ఎంతో మంది చిరు వ్యాపారాలు చేసుకునే వారు రోడ్డు మీద పడుతున్నారని పేర్కొన్నారు.
NTPC మేడిపల్లి సెంటర్ లో ఉన్న చిరు వ్యాపారులకు గతంలో ప్రత్యామ్నాయ మార్గం చూపిస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎటువంటి మార్గం చూపించ లేదన్నారు.
భయభ్రాంతులకు గురవుతున్న చిరు వ్యాపారులకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అలాగే సింగరేణి యాజమాన్యం చిరు వ్యాపారులు అందరికీ సింగరేణి స్థలం కేటాయించాలని లేని యెడల జీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇప్పటికే కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్ లలో నీటి సమస్య తలెత్తడంతో ఆయా డివిజన్ లోని ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
TUFC నిధుల ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చూసామన్నారు. గోదావరిఖని ప్రాంతంలో లైట్లతో జిగేల్ జిగేల్ అంటే ఏమీ రాదని ప్రజల జీవన విధానంలో,
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేలా ముందుకు పోవాలన్నారు. గత కొన్ని నెలలుగా రోడ్ల నిర్మాణం కోసం లక్ష్మీనగర్,
కళ్యాణ్ నగర్ ప్రాంతంలో రోడ్డు మరమ్మతుల పేరుతో రోడ్లు తవ్వి వదిలేసారని దీంతో స్థానిక వ్యాపారులు ఎన్నో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదుర్కొంటుందన్నారు.
ఇప్పటికైనా ప్రణాళికతో రోడ్ల నిర్మాణం చేపట్టి ముందుకు సాగాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు.
ఈ విలేకరుల సమావేశంలో డిప్యూటీ మేయర్ నడిపేల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్లు పాముకుంట్ల భాస్కర్,
గాదే అంజలి, నాయకులు అచ్చే వేణు, చిలకలపల్లి శ్రీనివాస్, నారాయణదాసు మారుతి, చల్లగురుకుల మొగిలి, చింటూ, ఇరుకురాల శ్రావణ్, నీరటి శ్రీనివాస్, రాజ్ కుమార్, నిట్టూరి రాజు, సత్తు శ్రీనివాస్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
Comments