అలరించిన నృత్య ప్రదర్శనలు.

Rathnakar Darshanala
అలరించిన నృత్య ప్రదర్శనలు.
నేటి వార్త, శేరిలింగంపల్లి:

శిల్పారామంలో ఆదివారం సాయంత్రం కూచిపూడి మరియు భరతనాట్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. బెంగళూరు నుండి విచ్చేసిన భరతనాట్య కళాకారిణి కుమారి భూమిక గౌడ ఆనంద నర్తన గణపతిమ్, 

శృంగారలహరి కీర్తన, అష్టపది, తిల్లాన అంశాలను ప్రదర్శించి మెప్పించారు.  

శ్రీ సిద్ధ కృష్ణ కూచిపూడి డాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ గురువర్యులు  సుజాత మూర్తి  శిష్య  బృందం గాయత్రీ, లలిత, సుభద్ర, తాన్యా, శాన్వి, లక్ష్మి,ఆద్య కళాకారులూ  గణేశా పంచరత్న, అంబాష్టకం, 

వచ్చెను అలమేలుమంగా, భో శంభో, స్వాగతం కృష్ణ, శంకర శ్రీగిరి, ఒకపరి కొకపరి, ధనశ్రీ తిల్లాన , మంగళం మొదలైన అంశాలను ప్రదర్శించి మెప్పించారు.
Comments