విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు పాటించండి.

Rathnakar Darshanala
విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా  జాగ్రత్తలు పాటించండి.
*రైతులకు ఇబ్బందులు లేకుండా విద్యుత్ అందిస్తాం*

*జిల్లా విద్యుత్ శాఖ ఎస్.ఈ శ్యాంకుమార్*

చెన్నూరు నేటివార్త అక్టోబర్ 27 

రైతులు పొలాలలో ఉన్న విద్యుత్ మోటార్లు మరియు ట్రాన్స్ఫార్మర్ల వద్ద జాగ్రత్తలు పాటిస్తేనే ప్రమాదాలు జరగకుండా అరికట్టవచ్చని జిల్లా విద్యుత్ శాఖ ఏస్.ఈ శ్యాం కుమార్ అన్నారు. 

చెన్నూర్ మండలంలోని ఆస్నాద్ సబ్ స్టేషన్ ఆవరణంలో ఏర్పాటుచేసిన రైతుల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రైతులకు విద్యుత్తు శాఖ అవలంబిస్తున్న విధి విధానాలపై మరియు గృహ అవసరాలకు అందిస్తున్న జీరో బిల్లులపై అవగాహన కల్పించారు. 

ఏదైనా సమస్య ఉంటే విద్యుత్తు శాఖ అధికారులను సంప్రదిస్తే పరిష్కరిస్తారని తెలిపారు. లోవోల్టేజి ఉంటే ఆ పరిధిలో ఉన్న రైతులు 63 హెచ్పి ట్రాన్స్ఫార్మర్లను పొందేందుకు డీడీలు తీసి అధికారులకు అందజేస్తే సమస్యను పరిష్కరించే విధంగా చూస్తామన్నారు. 

గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను వచ్చే రెండు నెలల్లో పరిష్కరించే విధంగా చూస్తామని ఆస్నాద్ ఎస్సీ కాలనీకి చెందిన సమస్యను పరిష్కరించి అగ్రికల్చర్ కు సంబంధించిన ఫీడర్ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని గ్రామంలో విద్యుత్ పోల్స్. థర్డ్  వైరు కూడా ఏర్పాటు చేస్తామనీ గ్రామంలో విద్యుత్ దీపాలు నిరంతరం  వెలగకుండా చూస్తామని,పేర్కొన్నారు. 

విద్యుత్ విషయంలో ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. 
 ఆస్నాద్ సబ్ స్టేషన్ ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.అనంతరం గ్రామ రైతులు అధికారులను శాలువాతో సన్మానించారు.

 ఈ కార్యక్రమంలో డి.ఈ కైసర్.కొమ్మెర ఏ.ఈ.శ్రీనివాస్. ఎల్.ఐ రాజమల్లు ఆస్నాధ లైన్మెన్ కుమార్. జె.ఎల్.ఎం వేణు. సురేష్ సబ్ స్టేషన్ సిబ్బంది రాజేందర్, సంతు. రాజబాబు, గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు.
Comments