నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు విస్తృతంగా పర్యటన.
By
Rathnakar Darshanala
నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు విస్తృతంగా పర్యటన.
వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం.
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.
నేటివార్త,ఖానాపూర్,అక్టోబర్29:
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.
మంగళవారం నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు.ఖానాపూర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో లబ్దిదారులకు కల్యాణలక్ష్మి,షాది ముబారఖ్ చెక్కులను పంపిణీ చేశారు.
మండలంలోని సత్తనపల్లి గ్రామంలోని పీఏసిఎస్ కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
పెంబి మండలకేంద్రంలో వైద్య కేంద్రాన్ని ,పాఠశాల అదనపు గదులను ప్రారంభించి లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు.రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని,ప్రభుత్వం రైతు సంక్షేమానికే కృషి చేస్తుందన్నారు.సన్నవడ్లకు త్వరలో 500 రూపాయల బోనస్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు.
పేద కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే ప్రభుత్వం అట్టడుగు వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు.పేద కుటుంబాల్లో పెళ్ళిల్లకు అయ్యే ఖర్చులో వారికి చేయుతగా
కళ్యాణలక్ష్మి,షాది ముభారఖ్ ల ద్వారా ప్రభుత్వం 1లక్ష రూపాయలు అందిస్తుందని,ప్రభుత్వం త్వరలో లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఆందజేస్తుందని అన్నారు.
ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం,500 వంటగ్యాస్ అందిస్తూ ఆరు గ్యారంటీలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం,పార్టీ మండల అధ్యక్షులు దయానంద్,నిమ్మల రమేష్,సత్యం,మండల అధికారులు తహసీల్దార్లు,ఎంపీడీవోలు,ఎంపీఓ లు,వ్యవసాయ,
ఆరోగ్య అధికారులు,సిబ్బంది,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments