రక్తదాన శిబిరంలో పాల్గొన్న పెగడపల్లి మండల యువకులు.

Rathnakar Darshanala
రక్తదాన శిబిరంలో పాల్గొన్న పెగడపల్లి మండల యువకులు.
పెగడపల్లి అక్టోబర్ 29 నేటి వార్త దినపత్రిక :

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం పరిధిలోని యువకులు స్వచ్ఛందంగా పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా పోలీసుల,

 ఆధ్వర్యంలో జగిత్యాల లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేసి పెద్ద మనసు చాటుకున్నారని పెగడపల్లి ఎస్ ఐ  సిహెచ్ రవికిరణ్ తెలిపారు. 

ఈ కార్యక్రమంలో పెగడపల్లి ఎస్ ఐ సి హెచ్ రవి కిరణ్ పాల్గొని  వారు మాట్లాడుతూ రక్తదానం చేసిన యువకులకు సర్టిఫికెట్లను అందించి, 

సమాజసేవలో యువత ముందు ఉండాలని సూచిస్తూ రక్తదానం చేసిన యువకులను అభినందించారు.ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ సంపత్ గౌడ్ పాల్గొన్నారు.
Comments