త్రి హుండ్ పర్వతం అధిరోహణం మరియు అధ్యారోహణం.

Rathnakar Darshanala
త్రి హుండ్ పర్వతం అధిరోహణం మరియు అధ్యారోహణం.  

నేటివార్త రాయికల్ అక్టోబర్ 29:

హిమాచల్ ప్రదేశ్ ధర్మశాల 2024 సంవత్సరానికి గాను రీజినల్ మౌంటనీరింగ్ సెంటర్లో శిక్షణ ఏర్పాటు చేశారు.

అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్  మౌంటెనీరింగ్ అండ్ అలైడ్ స్పోర్ట్స్ లో భాగంగా, మంగళవారం రోజు సోమ దత్,శ్యాంజి,బ్రీజ్ కేతన్,  సంతోష్ మేడం,మాస్టర్ శిక్షకులు ఆధ్వర్యంలో 2875 మీటర్ల అత్యంత ఎత్తైన పర్వతాన్ని 50 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, 

ఐదుగురు ప్రోగ్రాం ఆఫీసర్లు, ఐదుగురు మాస్టర్ శిక్షకుల సమక్షంలో అధిరోహించారు.

 దీన్ని అధిరోహించడానికి 10 కిలోమీటర్లు,ఆరోహణకి 10 కిలోమీటర్లు,మొత్తం 20 కిలోమీటర్ల పైచిలుకు ఎత్తైన పర్వతాన్ని ఉదయం ఎనిమిది గంటలకి ప్రారంభమై, 

మధ్యాహ్నం 12:30 గంటలకి చేరుకున్నారు.త్రీ హుండ్ అనే పర్వతం మూడు పర్వత పంక్తుల సముదాయం అని మాస్టర్ శిక్షకులు పేర్కొన్నారు.  

ఇంద్రునాథ్ దేవాలయం వైపు ఒక శ్రేణి అలాగే చంబ నుండి మరొక పర్వత శ్రేణి మూడవ పర్వత శ్రేణి మెక్ లోడ్ గంజ్ దరంకోట్ ఈ మూడు పర్వత శ్రేణులు కలవడం వల్ల ఆ పర్వత శ్రేణిని త్రీ హుండ్ అoటారని శ్యాంజి మాస్టర్ ట్రైనర్ పేర్కొన్నారు.9,400 

అడుగుల ఎత్తైన పర్వతాన్ని అత్యంత సాహసోపేతంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు వేణుమాధవ్,తులసీదాస్, మాలవత్ అనిల్ కుమార్,వై. 

కుశాల్ కుమార్,సంధ్య, సరిత,సుప్రియ, హర్షిత, ఆకుల అనూష,రాజు అధిరోహించారని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్  కాంటింజెంట్ లీడర్ డాక్టర్ పడాల తిరుపతి పేర్కొన్నారు.

ఉదయం వేళలో పర్వతారోహణలు తీసుకోవలసిన జాగ్రత్తలు,ఒకే వరుసలో వాలంటీర్లు వెళ్లడం, వెళ్ళేటువంటి క్రమంలో వాటర్ బాటిల్స్,దాంతో పాటుగా లంచ్, 

ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూస్, చాక్లెట్స్ తో పాటుగా ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే మెడికల్ కిడ్స్ తో సంసిద్ధంగా వెళ్లాలని,రీజినల్ మౌంటనీరింగ్ సెంటర్ అఫీషియట్ ఇంచార్జ్ శ్రీ జితేందర్ గారు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఉద్దేశించి జాగ్రత్తలు సూచించారు. 

అత్యంత అలవోకగా అధిరోహించిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తిరిగి ఈ  ఎత్తైన పర్వతాన్ని అవరోహించి రీజనల్ మౌంటై రింగ్ సెంటర్ ను సాయంత్రం ఐదు యాభై నిమిషాలకు చేరుకున్నారని,

 అత్యంత సాహసోపేతమైన నేషనల్ అడ్వెంచర్ ట్రైనింగ్ క్యాంపులో పాల్గొన్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు వారి యొక్క  ఆనందంతో పాటు మంచి అనుభూతులను పెంచుకున్నామని తెలియజేశారు.
Comments