పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.
By
Rathnakar Darshanala
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.
నేటివార్త జగిత్యాల బ్యూరో ఆక్టోబర్ 29 :
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం మెగా రక్తదాన శిబిరాన్ని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్ట్యూట్ లో ఏర్పాటు చేయగా జిల్లా ఎస్పీ ఆశోక్ కుమార్ ప్రారంభించారు.
రక్తదానం చేయడం వల్ల కలుగు ప్రయోజనాలను ఎస్పీ వివరించారు.ఈ సందర్బంగా పోలీస్ అధికారులు సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘచందర్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు మంచల కృష్ణ టి.వి సూర్యం సిరిసిల్ల శ్రీనివాస్ చింతసుధీర్ పలువురు యువకులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments