రూ. 10 నాణెం చెల్లుబాటు అవుతుంది...

Rathnakar Darshanala
రూ. 10 నాణెం చెల్లుబాటు అవుతుంది...
ప్రజలు అపోహలు వీడాలి.

నేటివార్త,ఖానాపూర్,అక్టోబర్29:

 రూ. 10 నాణెలు చట్టబద్ధమైనవని,రోజువారీ లావాదేవీలకు ఉపయోగించవచ్చని ఖానాపూర్ బ్రాంచ్ తిమ్మాపూర్ ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ ఈ.విజయ్ అన్నారు.

ఆయన మంగళవారం పట్టణంలోని విలేఖర్లతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.10 రూపాయల కాయిన్ చెల్లుబాటు కాదని ఇటీవల ఓ దుష్ప్రచారం జరుగుతుందని,

ప్రజలు 10 రూపాయల నాణెం చెల్లుబాటు పట్ల ప్రజలు,వ్యాపారులు అపోహలు వీడాలని అన్నారు.ప్రతి ఒక్కరూ 10 రూపాయల నాణేన్ని తప్పకుండా తీసుకోవాలన్నారు.

ఈ నాణేలను తీసుకోవడానికి నిరాకరించడం నేరంగా పరిగణించబడుతుందని ఇప్పటికే ఆర్బిఐ ప్రకటించిందన్నారు.నాణెం పట్ల దుష్ప్రచారం చేసిన,నాణేన్ని తిరస్కరించిన వారు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవలసి వస్తుందని  హెచ్చరించారు.

బ్యాంక్ సిబ్బంది ప్రజ్యోత్,అఖీబ్ తదితరులున్నారు.
Comments