విజేతలకు బహుమతులు అందజేత.

Rathnakar Darshanala
విజేతలకు బహుమతులు అందజేత.
వినయ్ డెకరేషన్స్.                   

పెద్దపల్లి అక్టోబర్ 26 నేటి వార్త ప్రతినిధి అడిచర్ల రమేష్

సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో సద్దుల బతుకమ్మ  రోజున బంగారు బతుకమ్మ పోటీలను నిర్వహించడం జరిగినది. 

సాంప్రదాయమైన పువ్వులతోటి అందంగా పేర్చిన బతుకమ్మలకు బహుమతులు సుల్తానాబాద్ పట్టణానికి చెందిన వినయ్ డెకరేషన్స్, ప్రొప్రైటర్, 

గాదం విన్ను.(వినయ్) బహుమతులు ఇప్పించడం జరిగినది.ఈ సందర్భంగా శనివారం యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ తో కలిసి బంగారు బతుకమ్మ పోటీల్లో గెలుపొందిన విజేతలకు వారి ఇండ్ల వద్దకే పెండ్లి పట్టు చీరలను అందించడం జరిగినది.

 ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అంటేనే పూర్వం గుడిలో ఆడి పాడేదని ప్రస్తుతం జనాభా బాగా పెరగడం వలన వివిధ స్థలాల్లో ఆడుతున్నారని 

ఈ సంవత్సరం శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించడానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన తమ్ముడు వినయ్ ని అభినందిస్తున్నానని అలాగే మహిళలకు నూతన ఉత్సాహాన్ని కలిగించేందుకు బహుమతులు ఇవ్వడం చాలా గొప్ప విషయమని,

అలాగే వచ్చే సంవత్సరం శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో వినయ్ డెకరేషన్ సిబ్బంది, తమ్ముళ్లు తదితరులు పాల్గొన్నారు.
Comments