సమ్మేళనంతో తెలంగాణ రాష్ట్రంలో పోరాటాలు.

Rathnakar Darshanala
సమ్మేళనంతో తెలంగాణ రాష్ట్రంలో పోరాటాలు.

బీసీ,ఎస్సీ,ఎస్టీ ల సంక్షేమానికే డీఎస్పీ పోరాటం.

నేటివార్త,ఖానాపూర్,అక్టోబర్26:

  ధర్మ సమాజ్ పార్టీ సమ్మేళనంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ విద్యా, వైద్యం ,ఉపాధి ,భూమి ఇల్లు లపై పోరాటం చేయనున్నట్లు ఆ పార్టీ నిర్మల్ జిల్లా ప్రచార కమిటీ సభ్యులు రామగిరి రవీందర్ అన్నారు.

 శనివారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం ముందు హైదరాబాద్ కేంద్రంలో నవంబర్ 3 న ఆదిభట్ల పిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించే పార్టీ కార్యకర్తల మహా సమ్మేళనం కరపత్రాలను విడుదల చేశారు.

 ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని 90 శాతం బీసీ ఎస్సీ ఎస్టీలకు విద్యా,వైద్యం,భూమి,ఉపాధి,ఇళ్లు ఈ ఐదు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. 

ధర్మ సమాజ్ పార్టీ అధినేత డాక్టర్ విశారదన్ మహరాజ్ ఈ సభ వేదిక నుండి తెలంగాణ రాష్ట్రంలో చేపట్టనున్న నూతన ప్రణాళికను తెలియజేయనున్నారని పేర్కొన్నాడు.

బీసీ,ఎస్సీ,ఎస్టీ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ధర్మ సమాజ్ పార్టీ పనిచేస్తుందని,తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది ధర్మ సమాజ్ పార్టీ ప్రభుత్వమేనని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కల్లూర్ సుధాకర్, మండల ప్రతినిధులు కుందూరు వినోద్, జంగం సాయి, ముత్యం తదితరులు పాల్గొన్నారు.
Comments