డీఎస్సీ ఉద్యోగాలో అన్యాయం జరిగింది - మందకృష్ణ మాదిగ.
By
Rathnakar Darshanala
డీఎస్సీ ఉద్యోగాలో అన్యాయం జరిగింది - మందకృష్ణ మాదిగ.
నేటివార్త జగిత్యాల బ్యూరో ఆక్టోబర్ 27 :
ఎస్సీ రిజర్వేషన్లలో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకుండా మాదిగ విద్యార్థి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న,
రేవంత్ రెడ్డి ప్రభుత్వ మొండి వైఖరినీ నిరసిస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాదిగల ధర్మ యుద్ధ మహాసభ లో భాగంగా జగిత్యాల జిల్లాలోని ఎల్జి గార్డెన్ లో మంద కృష్ణ మాదిగ బహిరంగ సభ సమావేశము నిర్వహించారు.
అంతకుముందు జగిత్యాల ప్రధాన రహదారిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మాదిగల రిజర్వేషన్ విషయంలో,
తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్యం ధోరణి వలన మాదిగలకు అన్యాయం జరుగుతుందని తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఎస్సీ రిజర్వేషన్ లో భాగంగా మాదిగలకు రిజర్వేషన్ వర్గీకరణ వెంటనే జరపాలన్నారు.
ఈ ఎస్సీ వర్గీకరణ చేయని యెడల మాదిగలకు తీవ్ర నష్టం వాటిలే అవకాశం ఉందని ఈమధ్య డీఎస్సీ ఉద్యోగాల్లో అన్యాయం జరిగింది.
ఎస్సీ వర్గీకరణ చేసి వుంటే మాదిగలకు ఉద్యోగాలు 2 ఇంతలు వరకు పెరిగేవి అని తెలంగాణలో ఎస్సీలలో 70% మాదిగలే ఉన్నందున వారికి రావలసిన ఉద్యోగాలు విషయంలో అన్యాయం జరుగుతుందని తెలుపుతూ,
ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రేవంత్ రెడ్డి దేశంలోనే ఎస్సీ వర్గీకరణ విషయంలో తెలంగాణ రాష్ట్రం మొదట ఉంటుంది అని చెప్పి మాట తప్పారు ఇప్పటికైనా ఎస్సీల వర్గీకరణ చేయాలని లేనియెడల సమ్మె ఉదృతం చేస్తామని చెప్పారు.
Comments