Ap :కావలి నియోజకవర్గం లో కొన్నిచోట్ల యదేచ్చగా వన్యప్రాణుల వేట.. మాంసం విక్రయాలు.

Rathnakar Darshanala
కావలి నియోజకవర్గం లో కొన్నిచోట్ల యదేచ్చగా వన్యప్రాణుల వేట.. మాంసం విక్రయాలు.
జింకలు,వన్యప్రాణుల వేటే లక్ష్యంగా విద్యుత్ తీగలు ఏర్పాటు

ఎన్నో రోజులుగా వన్యప్రాణుల వేట కొనసాగుతున్నా పట్టించుకోని ఫారెస్ట్ అధికారులు

అభివృద్ధి చేయడంలో మంచి పేరు తెచ్చుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వన్యప్రాణుల వేటగాళ్లపై అరాచకాలు పై దృష్టి సారించాలి

 ఏంటి వార్త అక్టోబర్ 29 నంద్యాల 


 ఏపీలోని  నెల్లూరు జిల్లాకావలి నియోజకవర్గ పరిధిలోని దగదర్తి మండలంలోని చెన్నూరు, బోడిగుడిపాడు,

మనుబోలుపాడు లింగాలపాడు,సిద్ధారెడ్డి పాలెం తదితర గ్రామాలు సమీపం లో అటవీ ప్రాంతంలో తిరుగుతున్న జింకలను,వన్య ప్రాణులను వేటాడేందుకు విద్యుత్ తీగలును.

 ఏర్పాటు చేసిన వేటగాళ్లు వన్య ప్రాణులను చంపి వాటి మాసం బహిరంగంగా అమ్మకాలు చేపడుతున్నట్టు సమాచారం,

జింక మాంసం ఒక కేజీ 400రూ ల నుండి 600 రూపాయలవరకువిక్రయిస్తున్నారని తెలుస్తుంది,వేటగాళ్లు చెన్నూరు పంచాయతీలోని సిద్ధారెడ్డి పాలెం వద్ద ఉన్న చింతలగుంట చెరువు వద్ద వన్యప్రాణుల మాంసం విక్రయిస్తున్నట్టు స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు, 

వన్యప్రాణుల చట్టాల ప్రకారం వన్యప్రాణుల అక్రమ వేట సాగించిన నేరగాళ్ళు పై అతి కఠినమైన శిక్షలు అమలుచేస్తారు, అడవి తో పాటు వన్యప్రాణులను సంరక్షించాల్సిన అటవీశాఖ అధికారులు, 

పోలీస్ అధికారులు ఈ అక్రమంగా వన్యప్రాణుల వేట సాగించే నేరగాళ్లపై ప్రత్యేక దృష్టి సారించి వన్యప్రాణులను కాపాడాలని స్థానిక ప్రజలతో పాటు వన్య ప్రాణి ప్రేమికులు కోరుకుంటున్నారు... 

ఇటీవల వేటగాళ్లు చిత్తూరు జిల్లాలో ఒక చిరుతను అతి భయంకరంగా చంపి దాని కాలిగోళ్ళు, పళ్ళు తీసుకెళ్లినఘటనమరువకముందే నెల్లూరు జిల్లాలో వన్యప్రాణులను యదేచ్ఛగా వేటాడుతున్నారు అనే వార్త కలవరపెడుతుంది, 

ఇప్పటికైనాజిల్లాఉన్నతాధికారులు స్పందించి ఈ వన్యప్రాణుల వేటను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు....
Comments