వినాయక నిమర్జణన్నికి అన్ని ఏర్పాట్లు పూర్తి.

Rathnakar Darshanala
వినాయక నిమర్జణన్నికి అన్ని ఏర్పాట్లు పూర్తి.
నేటివార్త జగిత్యాల బ్యూరో సెప్టెంబర్ 15 : 

జగిత్యాల పట్టణంలో నేడు రేపు జరిగే వినాయక నిమర్జణన్నికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది.

ఆదివారం జిల్లా ఎస్పీ ఆశోక్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఏర్పాట్లను పరిశీలించారు.
రోడ్ల మరమ్మత్తు మరియు కరెంట్ స్తంభాల నుండి మొదలుకొని నిమర్జనం అయ్యే చింతకుంట చెరువులోని తెప్పలు పడవల ఏర్పాట్ల వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రటిష్టమైన బందోబస్తు మరియు సీసీ కెమెరాల నిఘా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. 

ప్రశాంతమైన వాతావరణంలో వినాయక నిమర్జణం వేడుకలు నిర్వహించుకోవాలని  మండపాల నిర్వహకులకు కోరారు. 

ఆయన వెంట బల్దియా చైర్మన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ ఆర్డీఓ మధుసూదన్ డీఎస్పీ రఘుచందర్ మున్సిపల్ కమీషనర్ సమ్మయ్య పట్టణ సీఐ వేణుగోపాల్ ఎస్ఐలు జిల్లా అధికారులు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు  ఉన్నారు.
Comments