Wanaparthi :ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం.

Rathnakar Darshanala
Wanaparthi :ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం.
*--తల్లీ బిడ్డ క్షేమం,ప్రసవం చేసిన ఆర్టీసీ కండక్టర్*

*నేటివార్త ఆగస్ట్19 (వనపర్తి జిల్లా ప్రతినిధి విభూది కుమార్)*

గద్వాల నుండి వనపర్తికి వెళ్లే పల్లె వెలుగు బస్సు నెంబర్  2543 కండక్టర్ జి.భారతి ఈ 153073 వనపర్తికి 15 కిలోమీటర్ల దూరంలోని నాసహళ్లి గ్రామం వద్ద నిండు గర్భిణి  సంధ్య భర్త రామంజి కొండపల్లి అనే మహిళ గద్వాల మండలం సడన్ గా పురిటి నొప్పులు రాగా కండక్టర్ వెంటనే ఈ విషయాన్ని డిపో మేనేజర్ కి తెలుపగా డిపో మేనేజర్ సూచనల ప్రకారం బస్సు ఆపించి బస్సులో ఎవరైనా ట్రీట్మెంట్ తెలిసిన వారు ఉన్నారా అని కనుక్కొని అని తెలపడం జరిగింది. 

ఒక సిస్టర్ ఉందని తెలుసుకొని ఆమె సహాయంతో మగవారిని బస్సు నుండి దించేసి బస్సులోనే ఆ గర్భిణికి డెలివరీ చేయగా ఒక బేబీ గర్ల్, మహాలక్ష్మి పుట్టినది  తల్లి కూతుర్లు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు. 

వెంటనే కండక్టర్ 108 కి ఫోన్ చేసి అంబులెన్స్  సిబ్బంది వచ్చి వారిని వనపర్తి హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. గర్భిణీ చేసిన సాయంపై ప్రయాణికులు, ఊరి ప్రజలు ఆర్టీసీ సిబ్బందిని కండక్టర్ ని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.
Comments