ఇవాళ ప్రపంచ ఫోటోగ్రఫీ డే.

Rathnakar Darshanala
ఇవాళ ప్రపంచ ఫోటోగ్రఫీ డే.
-మధుర స్మృతుల జ్ఞాపకమే ఫోటోలు

నేటి వార్త రాయికల్ ఆగస్టు:19

కరిగేకాలంలో చెదరని మధుర స్మృతులకు ప్రతిబింబం ఫోటో.   ప్రతి ఫోటో వెనుక ఓ జ్ఞాపకం, ఓ కథ,ఓ అనుభూతి దాగుంటుంది. 

వంద మాటలతో చెప్పలేనిది ఒక్క ఫోటోతో చెప్పొచ్చు.ఈ క్షణాన్ని ఆస్వాదించేలోపే అది మాయమవుతుంది.ఇలాంటి కాలగమనంలో ఎన్నో జ్ఞాపకాలను ఒడిసిపట్టి భద్రంగా బంధించి ఉంచేదే ఫోటో.
కోట్ల పదాలతో వర్ణించలేని భావాన్ని ఒక్క ఫోటో కళ్లకు కడుతుంది.కరుణ,భక్తి,హాస్యం,రౌద్రం, శాంతం,బీభత్సం,భయానకం, , వీరత్వం ఇలా నవరసాలతో పాటు జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలను, గతస్మృతులను పదిలం చేసుకోవడం ఫోటోలతోనే సాధ్యం.

అందమైన జ్ఞాపకాలు, తియ్యటి అనుభూతులు, మధుర ఘట్టాలు,విషాదసన్నివేశాలు,వెలకట్టలేని దృశ్యాలను పదికాలాలపాటు పదిలంగా మన కళ్ల ముందు ఉంచేది ఫోటో.మానవుడు ఆవిర్భవించిన ఆవిష్కరణలో అతి ముఖ్యమైనవాటిలో ఒకటి 'ఫోటో కెమెరా'
ఈ భూమిపై ఉన్న జీవరాశులను మన కంటితో చూస్తాం లేదా చూసినవారు చెప్తే ఆ ఆకారాన్ని మన మదిలో ఊహించుకుని ఒక రూపాన్ని చూస్తాం.

ఓ చిత్రకారుడు వేసే చిత్రం ద్వారా కూడా అనేకమైన చిత్రాలను చూడగలం.కానీ, సముద్రపు అడుగున,భూమి చివరంచుతో పాటు ఈ విశ్వం ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు మనం ఫోటోల ద్వారా చూడగలుగుతున్నాం.

 ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్‌‌లను ఏకం చేయడం,
ప్రోత్సహించే లక్ష్యంతో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 19న ప్రపంచ స్థాయిలో జరుపుకుంటారు.
Comments