MLA Payal shankar :320 కోట్లతో అదిలాబాద్ పట్టణ అభివృద్ధికి శ్రీకారం.

Rathnakar Darshanala
MLA Payal shankar :320 కోట్లతో అదిలాబాద్ పట్టణ అభివృద్ధికి శ్రీకారం.
దుర్గంధ భరితంగా ఖానాపూర్  చెరువు.

ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులు.

ఆదిలాబాద్ బ్యూరో నేటి వార్త :

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహకారంతో 320 కోట్లు మంజూరైనట్టు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. 

శుక్రవారం ఉదయం మున్సిపల్ కమిషనర్ ఇరిగేషన్ అధికారులు పబ్లిక్ హెల్త్ అధికారులతో కలిసి ఆకస్మికంగా చెరువు పరిసరాలను సందర్శించారు. 

చెత్తాచెదారం పేరుకుపోయి చెరువు దుర్గంధ ఫలితంగా మారిందని దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. 

అదిలాబాద్ పట్టణంలో దోమల వ్యాప్తికి చెత్తాచెదారంతో కూడిన చెరువు కూడా కారణమన్నారు. 

320 కోట్లతో  అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి అవసరాలు తీరుస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.అభివృద్ధి పనులపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలన్నారు.
Comments