Hyd :జర్నలిస్టులకు కేటాయించిన స్థలంలో ఇళ్ల నిర్మాణానికి పూర్తి సహకారం - ఎమ్మెల్యే గాంధీ హామీ.
By
Rathnakar Darshanala
Hyd :జర్నలిస్టులకు కేటాయించిన స్థలంలో ఇళ్ల నిర్మాణానికి పూర్తి సహకారం - ఎమ్మెల్యే గాంధీ హామీ.
*-ఎమ్మెల్యే గాంధీని కలిసిన శేరిలింగంపల్లి జర్నలిస్టులు*
*-జర్నలిస్టులకు కేటాయించిన స్థలంలో ఇళ్ల నిర్మాణం కోసం వినతి*
నేటి వార్త,శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీని ఆదివారం శేరిలింగంపల్లి మండల జర్నలిస్టులు కలిశారు. శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ (టీయూడబ్ల్యూజె) ఆధ్వర్యంలో రాష్ట్ర,
జిల్లా స్థాయి జర్నలిస్టు నాయకులతో కలిసి ఎమ్మెల్యే ను కలిసిన జర్నలిస్టులు తమ ఇళ్ల నిర్మాణం కోసం ఎమ్మెల్యే గాంధీకి వినతిపత్రం అందజేశారు.
ఎమ్మెల్యే గాంధీ సహకారంతో గతంలో చందానగర్ లోని సర్వే నెంబర్ 174లో కేటాయించిన 1 ఎకరం స్థలంలో జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు సహకరించాలని కోరారు.
టీయూడబ్ల్యూజె రాష్ట్ర నాయకులు ఫైళ్ల విట్ఠల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్, జిల్లా ఉపాధ్యక్షుడు గంట్ల రాజిరెడ్డి, శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉప్పరి రమేష్ సాగర్ ల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తో సమావేశమై ఇళ్ల నిర్మాణం పై చర్చించారు.
ఈ సందర్భంగా జర్నలిస్టు నాయకులు మాట్లాడుతూ దశాబ్దాలుగా శేరిలింగంపల్లి లో జర్నలిస్టులుగా పనిచేస్తూ సొంత ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టుల కోసం ఎమ్మెల్యే గాంధీ సహకారంతో 2023లో ఒక ఎకరం భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని అన్నారు.
చందానగర్ లోని సర్వే నెంబర్ 174లో గల ఒక ఎకరం భూమిని శేరిలింగంపల్లి జర్నలిస్టుల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం నాటి రంగారెడ్డి కలెక్టర్ హరీష్ ప్రొసీడింగ్ నెంబర్ ఎల్ సి1/2533/2023ని 2023వ సంవత్సరం సెప్టెంబర్ 19వ తేదీన జారీ చేశారని,
స్థానిక రెవెన్యూ అధికారులు సైతం సర్వే, పంచనామా నిర్వహించి స్థలాన్ని అప్పగించారని తెలిపారు. తమకు కేటాయించిన భూమిలో ఎమ్మెల్యే గాంధీ చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు.
జర్నలిస్టుల ఇళ్ల కోసం కేటాయించిన భూమిలో ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు సహకరించాలని, భూమి కేటాయింపులో ముందుండి మంజూరు చేయించిన ఎమ్మెల్యే గాంధీ ఇళ్ల నిర్మాణంలో సైతం సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ జర్నలిస్టుల సొంతింటి కలను సాకారం చేసేందుకు చందానగర్ కేటాయించిన భూమిలో ఇళ్ల నిర్మాణం కోసం తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యేను కలిసిన వారిలో శేరిలింగంపల్లి టెంజు మాజీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మెట్టు జగన్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు పి.అమృత్ గౌడ్, ఉపాధ్యక్షుడు గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్, కోశాధికారి లక్ష్మీనారాయణ,
టెంజు అధ్యక్షుడు పి.సాగర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కె. కిషోర్ కుమార్,ప్రెస్ క్లబ్, టెంజు నాయకులు, జర్నలిస్టులు ఎల్లేష్, ఖదీర్, షకీల్ , కె. రాజు, రాజేష్ గౌడ్,
అనిల్ కుమార్ ముదిరాజ్, క్రిష్ణా సాగర్ , శివ ముదిరాజ్, ప్రశాంత్ రెడ్డి, హేమంత్ రెడ్డి, యాదయ్య, ప్రభాకర్ రెడ్డి, దేవేందర్, సురేష్, రాజు, ఆనంద్ గౌడ్, సత్యం, శ్రీధర్,గణేష్,రామకృష్ణ, మల్లేష్, శ్రీనివాస్, రాజేష్, రాకేష్, భాస్కర్, అశోక్, కర్రబాబు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
Comments