Kammam :భారీ వర్షాలతో రాకపోకలు బంద్.

Rathnakar Darshanala
Kammam :భారీ వర్షాలతో రాకపోకలు బంద్.
అశ్వారావుపేట (నేటి వార్త)


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా  భారీ వర్షం కురుస్తుంది.అశ్వారావుపేట,దమ్మపేట,ములకలపల్లి మండలాల్లో వర్షప్రభావం ఎక్కువగా ఉంది.

ములకలపల్లి మండలం కేంద్రంలోని గన్నేరు వాగు పొంగి ప్రవహిస్తుండటంతో పంట పొలాలు నీట మునిగి ప్రధాన రహదారిపై వర్షపునీరు ప్రవహిస్తోంది.

మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ కొరకు చేపట్టిన పనులు అసంపూర్ణంగా ఉండటంతో వరదనీరు ఎక్కడిక్కడ నిలిపోతుంది దీనితో ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

మరోవైపు మండలంలో ప్రధానమైన పాములేరు వాగు పొగళ్లపల్లి వద్ద ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో.ములకలపల్లి మండల కేంద్రానికి దాదాపు 20 గిరిజన గ్రామాల నుండి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

గత నెలలో కురిసిన వర్షాలకు రింగిరెడ్డిపల్లి వద్ద రహదారి కొట్టుకుపోవటంతో తాత్కాలికంగా నిర్మించిన ఐరన్ బ్రిడ్జి సైతం కృంగిపోయింది.దీనితో ఐరన్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిచిపోయాయి.

బ్రిడ్జి కాంట్రాక్టర్ నాసిరకం పనుల కారణంగానే, నిర్మించిన 15రోజుల్లోనే బ్రిడ్జి క్రుంగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వికే రామవరం దగ్గర రహదారి పైనుండి వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో పుసుగూడెం వైపు రాకపోకలు నిలిచిపోయాయి.

తిమ్మంపేట గ్రామానికి ఎగువనున్న పాలవాగు నుండి వరదనీరు పొంగి ప్రవహించి తిమ్మంపేట కాలని నివాసాలను చుట్టుముట్టింది.దీనితో ఎక్షణం ఎలా ఉంటుందోనని గ్రామస్తులు భయందోళన చెందుతున్నారు.

మండలంలోని చౌటుగుడెం,కమలాపురం, తాళ్ళపాయి,మంగలిగుట్ట,ముత్యలంపాడు, గ్రామాలలో ప్రజలు ఎడతెరిపి లేని వర్షం కారణంగా  ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మండల వ్యాప్తంగా రహదారులపై వరద ప్రవహిస్తూ ఉండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పలుచోట్ల వరద ప్రవహాలలో చిక్కుకున్న వారిని స్థానికులు ఒకరికొకరు సాయం చేసుకుంటూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
Comments