Mulugu jilla :తల్లిపాల వారోత్సవాలు.
By
Rathnakar Darshanala
Mulugu jilla :తల్లిపాల వారోత్సవాలు.
నేటి వార్త వెంకటాపురం నూగూరూ (ఆగస్టు 7)
ములుగు జిల్లా వెంకటాపురం మండలం తల్లిపాల వారోత్సవాలు సందర్భంగా ఈరోజు ఐసిడిఎస్ వెంకటాపురం ప్రాజెక్టు పరిధిలోని పాత్ర పురం అంగన్వాడి సెంటర్లో సిడిపిఓ శ్రీమతి ముత్తమ్మ గారి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం అన్న ప్రసన్న కార్యక్రమం జరిగింది.
ప్రాజెక్టు అధికారి శ్రీమతి ముత్తమ్మ గారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి వారం తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నామని,
బిడ్డ పుట్టిన వెంటనే ముర్రు పాలు, తల్లిపాలు బిడ్డకు మనము ఇచ్చే తొలి టీకా వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటాయి అని తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి బిడ్డల బంధం బలపడుతుంది,
తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డకు శ్వాసకోద వ్యాధులు ,విరోచనాలు అస్తమ, ఉబకాయము నుండి రక్షణ చేకూరును అని తల్లిపాలు ఇవ్వడం వలన తల్లికి గర్భకోశ వ్యాధులు, రొమ్ము క్యాన్సరు బారిన పడకుండా ఉంటారని తల్లులకు వివరించారు.
వెంగళరావుపేట అంగన్వాడి కేంద్రంలో తల్లిపాలు వారోత్సవాల భాగంగా అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది బిడ్డకు ఆరు నెలలు నిండే వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి అని ఆరు నెలలు నిండగానే తల్లిపాలలో పాటు అదనపు ఆహారం ఇవ్వాలని బిడ్డకు రెండు సంవత్సరాలు వచ్చేవరకు తల్లిపాలు కొనసాగించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ దూడపాక చంద్రకళ అంగన్వాడి టీచర్లు విజయ సుశాంతల ,సీతారత్నం, గర్భిణులు బాలింతల తల్లులు అనిత, రామకృష్ణ, విజయలక్ష్మి, ఉషారాణి, పాల్గొన్నారు
Comments