Kammam :జర్నలిస్ట్ వెంకట్ రెడ్డి మృతికి టీయూడబ్ల్యూజే సంతాపం.

Rathnakar Darshanala
జర్నలిస్ట్ వెంకట్ రెడ్డి మృతికి టీయూడబ్ల్యూజే సంతాపం.

--- మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
--- 4 రోజులుగా వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఆసుపత్రి వద్ద తోడుగా ఉన్న టియుడబ్ల్యూజే జర్నలిస్టుల బృందం
--- టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ చిర్రా రవి

నేటి వార్త ఖమ్మం బ్యూరో ఆగస్టు:7

 జర్నలిస్ట్ వెంకట్ రెడ్డి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ చిర్రా రవి డిమాండ్ చేశారు. 

ఖమ్మం రూరల్ మండలం జాన్ పహాడ్ తండాకు చెందిన ఏలేటి వెంకటరెడ్డి (46) గత దశాబ్ద కాలంగా వాయిస్ ఆఫ్ వర్డ్స్ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. 

వెంకటరెడ్డికి వారసత్వంగా వస్తున్న భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నాడని పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసి, భూమి కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పటికిని లెక్కచేయకుండా జాన్ పహాడ్ తండాకు చెందిన జాటోత్ వీరన్న ఆయన కుటుంబ సభ్యులు ట్రాక్టర్ తో తన భూమిని సాగు చేస్తుంటే అది చూసిన వెంకట్ రెడ్డి ఆపమని చెప్పిన వినకపోయేసరికి తీవ్ర మనస్థాపానికి గురై పొలం వద్ద ఉన్న పురుగులు మందు తాగి ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 

అపస్మారక స్థితిలో ఉన్న వెంకట్ రెడ్డిని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఖమ్మంలోని శ్రీ రక్షా హాస్పిటల్ కు తరలించారు. 

ఇది తెలుసుకున్న ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు, జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణకు సమాచారం అందించారు. ఆదినారాయణ తనతో జర్నలిస్టుల బృందంతో ఆసుపత్రికి వెళ్లి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వెంకటరెడ్డి పరిస్థితిని చూసి డాక్టర్ ను సంప్రదించారు. 

వెంకట్ రెడ్డి ఆరోగ్యం విషమంగా ఉందని ఐదు రోజులు గడిస్తే గాని చెప్పలేమని డాక్టర్ తెలిపారు. వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులకు  ఆదినారాయణ ధైర్యం చెప్పారు. వెంకట్ రెడ్డి ఆదివారం ఆసుపత్రిలో చేరిన దగ్గర నుండి గుద్దేటి రమేష్ బాబు, తోటి జర్నలిస్టుల బృందంతో 3 రోజులు ఆసుపత్రిలో వెంకట్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూనే ఉన్నారు.  

అదేవిధంగా వెంకట్ రెడ్డి భూవివాదం గురించి జర్నలిస్టుల బృందంతో వెళ్లి రూరల్ సీఐ రాజిరెడ్డిని కలసి వెంకట్ రెడ్డి కి న్యాయం చేయాలని కోరారు. దురదృష్టవశాత్తు మంగళవారం తెల్లవారుజామున జర్నలిస్ట్ వెంకట్ రెడ్డి మృతి చెందాడు. 

విషయం తెలుసుకున్న ఆకుతోట ఆదినారాయణ చిర్రా రవి గుద్దేటి రమేష్ బాబు మిగతా జర్నలిస్టులు వెంకట్ రెడ్డి మృతికి సంతాపం ప్రకటించి కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు. 

వెంకట్ రెడ్డి భూమిని కబ్జా చేసి ఆయన మృతికి కారుకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

వెంకట్ రెడ్డి మృతికి సంతాపం తెలిపిన వారిలో జిల్లా ఉపాధ్యక్షులు టిఎస్ చక్రవర్తి, ఖమ్మం ప్రెస్ క్లబ్ సెక్రటరీ కొరకొప్పుల రాంబాబు కోశాధికారి బిక్కి గోపి ముత్యాల కోటేశ్వరరావు జీవన్ రెడ్డి  సంతోష్  పులి శ్రీనివాస్  వెంకట కృష్ణారావు ఉత్కంఠం శ్రీనివాస్  పాషా తదితరులు ఉన్నారు.
Comments