కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి.
By
Rathnakar Darshanala
కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి.
- గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకాడే
హన్మకొండ, ఆగస్టు07(నేటి వార్త ):
హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ ప్రాంగణంలో బుధవారం స్వచ్ఛదనం - పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే పాల్గొని స్వచ్ఛదనం - పచ్చదనం లో భాగంగా రెడ్ క్రాస్ ఆవరణలో మొక్కలు నాటారు.
అనంతరం తలసీమియా సెంటర్ ను సందర్శించి పిల్లలకు పండ్లు పంపిణి చేశారు.ఈ సందర్బంగా డాక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ మొక్కలను అధికసంఖ్యలో నాటి వాటి సంరక్షణలో సైతం పాలుపంచుకుంటే భవిష్యత్తు తరాలకు ఎంతో ఉపయోగమన్నారు.
కాలుష్యాన్ని నివారించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు. తలసీమియా సెంటర్ లోని బాధితులకు ఉచిత రక్తం తో పాటు రెడ్ క్రాస్ నిర్వహిస్తున్న రక్త కేంద్రం, జనరిక్ మందులషాపు, టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్, డిసాస్టర్ మేనేజ్మెంట్, జూనియర్,
యూత్ రెడ్ క్రాస్ తో చేస్తున్న సామజిక సేవలకు గాను రెడ్ క్రాస్ సొసైటీ పాలకవర్గాన్ని అభినందించారు. నేను సైతం రెడ్ క్రాస్ సొసైటీ తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.
ఈ సందర్బంగా అశ్విని తానాజీ వాకడే ని రెడ్ క్రాస్ పాలకవర్గం షీల్డ్, శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో హనుమకొండ రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ పి. విజయచందర్ రెడ్డి, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఈ.
వి. శ్రీనివాస్ రావు, జిల్లా పాలకవర్గ సభ్యులు పుల్లూరి వేణు గోపాల్, డాక్టర్ యం. శేషుమాదవ్, పొట్లపల్లి శ్రీనివాస్ రావు, రెడ్ క్రాస్ డాక్టర్లు డాక్టర్. జె. కిషన్ రావు, డాక్టర్. టి. మదన్ మోహన్ రావు, డాక్టర్. మొహమ్మద్ తహర్ మసూద్, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments