Hyd :అక్రమార్కులకు దడ పుట్టిస్తున్న హైడ్రా.మొదలైన కూల్చివేతలు.

Rathnakar Darshanala
Hyd :అక్రమార్కులకు దడ పుట్టిస్తున్న హైడ్రా.మొదలైన కూల్చివేతలు.
*-మాదాపూర్ లో ఎన్ కన్వెన్షన్ కూల్చివేత* 

 నేటి వార్త , శేరిలింగంపల్లి:

 అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది ఎంతంటి వారైనా సరే తగ్గేదే లేదంటున్నారు. 

శేరిలింగంపల్లి నియోజిక వర్గం లోని చందానగర్ జిహెచ్ఎంసి సర్కిల్ 21మాదాపూర్ డివిజన్ పరిధిలోని తమ్మిడి చెరువులో  సినీ హీరో నాగార్జున ఎఫ్ టీ ఎల్ లోమూడున్నర ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్ను నిర్మించారని,

 అధికారులకు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో శనివారం ఉదయమే భారీ బందోబస్తు మధ్య కన్వెన్షన్ కూల్చివేతను అధికారులు చేపట్టారు. 

తుమ్మిడి చెరువునుకబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఈ కూల్చివేత లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై జనం కోసం స్వచ్ఛంద సంస్థ ఇటీవల పూర్తిఆధారాలతో సహా హైడ్రా కమిషనర్ కు పిర్యాదు చేసిన విషయంవిదితమే.

అయితే, నాగార్జునకు చెందిన నిర్మాణం కావటంతో అధికారులు కూల్చివేత వంటి నిర్ణయాలు తీసుకుంటారా అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. అయితే, 

రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని ఈ చర్య తో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథన్ స్పష్టం చేసారు.

అదేవిధంగా మరోవైపు చెరువులు ఆక్రమణచేసినిర్మాణాలు చేపట్టిన కబ్జాదారుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తుతున్నాయి.
Comments