ఈ శికం సంగతేంటి..? గోదావరిఖనిలో మాయమైన అడ్డగుంట చెరువు..!

Rathnakar Darshanala
ఈ శికం సంగతేంటి? గోదావరిఖనిలో మాయమైన అడ్డగుంట చెరువు..! 
నాటి పాలకుల అవినీతికి నిదర్శనం! 


(జేమ్స్ రెడ్డి నేటి వార్త ప్రతినిధి) 

రామగుండం నియోజకవర్గంలో ఒకనాడు ఎఫ్సిఐ నుంచి వచ్చే నీళ్లతో కలకలలాడిన అడ్డగుంట చెరువు పూర్తిగా మాయమైంది,! 

ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరువులపై ఏర్పాటు చేసిన యోధానయోధుల మేడలను మిద్దెలను కూల్చివేస్తున్న వైనం పలువురు ఆశిస్తున్నారు, 

చెరువు శిఖాలను ఆక్రమించుకొని అక్రమ కట్టడాలు కట్టుకున్న భూ కబ్జాదారులకు ప్రస్తుత తెలంగాణ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం మంచి గుణపాఠం చెప్తుందని పలువురు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు, 

ఈ నేపథ్యంలో రామగుండం నియోజకవర్గం అడ్డగుంటపల్లి ఒకనాడు గోదావరిఖని జనగామ గ్రామంగా ఉండేది తర్వాత అడ్డగుంటపల్లిగా మారింది ఎప్పుడైతే ఘనులు ఏర్పడ్డాయో అప్పుడే గోదావరిఖనిగా మారింది, 

అప్పటినుంచి అడ్డగుంట చెరువు కళకళలాడుతూ వచ్చింది, కొంతమంది భూకబ్జాదారుల కన్ను అడ్డగుంట చెరువు పై పడింది దీంతో చెరువు మాయమై బిల్డింగులు వెలిశాయి, 

దీనికి కారణం గత ప్రభుత్వాల అవినీతి గత రెవెన్యూ అధికారుల లంచగొండితనం అన్నీ కలిసి అడ్డగుంట చెరువు ని పూర్తిగా నామరూపాలు లేకుండా చేశారు, 

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి వాడు మగాడ్రా బుజ్జి అనే చందంగా సింగరేణి కోటలను సైతం కూల్చి వేస్తూ రోడ్లు నిర్మాణాలు చేసి ప్రజలకు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్న ప్రస్తుత డైనమిక్ కాంగ్రెస్ శాసనసభ్యులు పి అడ్డగుంట చెరువు శిఖం ఏమైంది ఎలా మాయమైంది,! 

అనే దానిపై పూర్తి విచారణ చేసి భూ కబ్జాదారులకు తగిన గుణపాఠం చెప్పి తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న శేరువు శిఖములపై తొలగిస్తున్న అక్రమ కట్టలారా మాదిరిగానే అడ్డగుంట చెరువుని పునరుద్ధరించాలని పలువురు కోరుకుంటున్నారు, 

డైనమి క్ ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్సింగ్ ఆలోచించాలని ఆ దిశగా అధికారులను మేలుకొల్పాలని పూర్తి విచారణ జరిపించాలని గతంలో ఏం జరిగింది చెరువు ఎలా మాయమైంది అనే దానిపై అక్రమ కట్టడాలు ఎలా వెళ్తాయని దానిపై విచారణ జరిపి చెరువుని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు,
Comments