ప్రమాదవశాత్తు తాటిచెట్టుపైనుంచి పడి గీతకార్మీకుడి మృతి.
By
Rathnakar Darshanala
ప్రమాదవశాత్తు తాటిచెట్టుపైనుంచి పడి గీతకార్మీకుడి మృతి.
చెన్నూరు రూరల్ నేటివార్త ఆగస్ట్ 23
వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న గౌడన్నల బ్రతుకులను అదే వృత్తి వారిని కబలిస్తున్నది. రెక్కాడితే గానీ డొక్కాడని గీతకార్మీకుల జీవితాలు మధ్యలోనే చితికి చేరుతున్నాయి.
అభం శుభం తెలియని గౌడన్నల బ్రతుకులు అర్థాయువుతో ముగిసిపోతున్నాయి. చెన్నూరు మండలం గుండయ్యపల్లే గ్రామానికి చెందిన ముక్కెర సతీష్ గౌడ్ శుక్రవారం రోజున తాటి చెట్టుపై నుండి పడి మరణించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం సతీష్ గౌడ్ తాటి చెట్టు ఎక్కి కల్లుగీస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి మరణించినట్లు పేర్కొన్నారు. వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఆయన మరణించడంతో గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.
Comments