గురుకులాలను సందర్శించిన తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ (టిజిపిఎ).
By
Rathnakar Darshanala
గురుకులాలను సందర్శించిన తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ (టిజిపిఎ).
ఖమ్మం :ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు.
కోట లోకేష్ సూచనలతో
శ్వాసకి గాలి ఎంత అవసరమో సంఘాలకు నిరంతరం సేవా సర్వీస్ అంతే అవసరం.అని ఇంచార్జి కోటా లోకేష్ తెలియపరిచారు.
ఆదివారం రెండవ శనివారం ప్రతి గురుకులాలలో పేరెంట్ కమిటీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా
కస్తూర్బా గాంధీ సోషల్ వెల్ఫేర్ గురుకులాలు సందర్శన చేసి అక్కడున్న సమస్యలు తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులతో వాటి గురించి చర్చించడం జరిగింది.
మధిర మండలం కిష్టాపురంలో ఉన్న ముదిగొండ గురుకుల పాఠశాలను సందర్శించినటువంటి తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా కమిటీ.
అక్కడ ఉన్నటువంటి ఇన్చార్జి ప్రిన్సిపాల్ గా ఉన్న ఐతం సైదులు కస్తూర్బాగాంధీ బాలికల హాస్టల్ ప్రిన్సిపాల్ పాలకుర్తి రాణి మరియు బోనకల్లు మండల సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్ ప్రిన్సిపాల్ పద్మావతిని సన్మానించడం జరిగింది.
ఈ సందర్బంగా ఐతం సైదులు సార్ సొసైటీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను టిజిపిఎ ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులకు వివరించడం జరిగినది.
అసలు మన పిల్లోడికి సొసైటీ ఎంత ఖర్చు చేస్తున్నది అప్పుడున్న రేట్లకి ఇప్పుడున్న రేట్లకి ఎంత వేరియేషన్? ఉన్నది.అసలు హాస్టల్లో పిల్లలు ఎలా ఉండాలి ? అలా ఎలా బ్రతకాలో ?పిల్లలకు అందవలసిన సౌకర్యాలు గురించి మరియు స్కూలు ఎస్టాబ్లిష్మెంట్ గురించి.మొత్తం క్షుణ్ణంగా దగ్గర దగ్గర రెండు గంటల పైగా వివరించడం జరిగినది.
ఇటువంటి ఉపాధ్యాయులు మన గురుకులాలలో దొరకటం మన పిల్లల అదృష్టంగా భావించాలి అని మరియు నూతనంగా పేరెంట్స్ కమిటీగా ఎన్నికైనటువంటి కమిటీ వారు అనునిత్యం గురుకులాలు మన బాధ్యతగా భావించాలి,
అని హాస్టల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు వచ్చిన ప్రతిసారి పర్యవేక్షించాలి అని అట్టి సమస్యలు వెంటనే ప్రధానోపాధ్యాయులకు తెలియపరచి పరిష్కరించే రీతిగా కమిటీ ముందుకు వెళ్లాలని ఖమ్మం జిల్లా అధ్యక్షులు గొల్లమందల శ్రీనివాస్ సూచించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
టిజిపిఎ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
వరకాల విజయ కుమారి
ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి
పొట్ట పింజర చిట్టిబాబు
జిల్లా ఉపాధ్యక్షులు ముత్యాల రాజు జిల్లా సంయుక్త కార్యదర్శి
చప్పిడి అనూష వెంకట్రావు సోషల్ మీడియా కన్వీనర్ మాతంగి అనిల్ కుమార్ జిల్లా కమిటీ సభ్యులు
బానోతు సైదులు చప్పిడి వెంకట్రావు
సాంస్కృతి కల్చరల్ కన్వీనర్ చాపలమడుగు కోటేశ్వరరావు దర్శి కిరణ్ బోనకల్ మండల కమిటీ సభ్యులు ముదిగొండ గురుకుల పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు నూతనంగా పేరెంట్స్ కమిటీగా ఎన్నికైనటువంటి తల్లిదండ్రులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Comments