చార్జర్ కేబుల్ నోట్లో పెట్టుకుని చిన్నారి మృతి.

Rathnakar Darshanala
చార్జర్ కేబుల్ నోట్లో పెట్టుకుని చిన్నారి మృతి.

నేటివార్త,ఖానాపూర్,ఆగస్టు02:

అభం శుభం తెలియని చిన్నారి గురువారం రాత్రి మొబైల్ ఫోన్ ఛార్జింగ్ కేబుల్ నోట్లో పెట్టుకుని విధ్యుత్ఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయింది.

స్థానికులు తెలిపినట్లుగా నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కొత్త మద్దిపడగ గ్రామానికి చెందిన దుర్గం సుశీల, రాజలింగు దంపతుల కుమార్తె ఒక సంవత్సరం ఆరునెలల చిన్నారి దుర్గం ఆరాధ్య ఆడుకుంటూ వెళ్లి ఇంట్లోని స్విచ్ బోర్డుకు వేలాడి ఉన్న మొబైల్ ఫోన్ ఛార్జింగ్ కేబుల్ ని నోట్లో పెట్టుకుని షాక్ కి గురైంది.

గమనించిన కుటుంబీకులు చిన్నారిని ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.దీంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

అప్పటివరకు ఆడుకుంటూ,పాడుకుంటూ గడిపిన చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబీకులు గుండెలు బాదుకుంటూ విలపిస్తున్నారు.
Comments