నేటివార్త కథనానికి స్పందన...
By
Rathnakar Darshanala
నేటివార్త కథనానికి స్పందన...
*ఇది కాలువ కాదు కాలనీ. కథనానికి స్పందించిన ఆదికారులు*
చెన్నూరు రూరల్ నేటివార్త ఆగస్ట్ 9 :
చెన్నూరు మండలం లోని ఆస్నాద్ గ్రామంలో నెలకొన్న వరదనీరు సమస్యపై గురువారం రోజున నేటివార్త పత్రికలో వెలువడిన "ఇది కాలువ కాదు కాలనీ". ఆనే శీర్షిక వెలువడిన విషయం విదితమే,
ఈ శీర్షిక పై స్పందందించిన మండల అధికారులు గ్రామ పంచాయతీ సిబ్బందితో కలసి కాలనీలోని మురుగు నీరు తీసివేసి క్లోరినేషన్ చేయిచారు.
ఈ సందర్భంగా కాలనీ వాసులు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పంచాయతి సెక్రటరీ గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments