అడోబి సీఈవో శంతను నారాయణ్ గారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.
By
Rathnakar Darshanala
అడోబి సీఈవో శంతను నారాయణ్ గారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.
నేటి వార్త ఇంటర్నేషనల్ :
ప్రఖ్యాత అడోబి సిస్టమ్స్ (Adobe Systems) సీఈవో శంతను నారాయణ్ గారితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భేటీ అయ్యారు. ఫ్యూచర్ స్టేట్ తెలంగాణకు పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తోన్న ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం కాలిఫోర్నియాలో పలువురు గ్లోబల్ బిజినెస్ లీడర్లలో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు.
అందులో భాగంగా శుక్రవారం అడోబీ సీఈవోతో సమావేశంలో సీఎం తోపాటు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
తెలంగాణలో ప్రజాప్రభుత్వం తలపెట్టిన హైదరాబాద్ 4.0, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ స్థాపన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు తదితర ప్రణాళికలపై ఆసక్తి కనబర్చిన శంతను నారాయణ్ గారు ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావడానికి అంగీకరించారు.
స్ఫూర్తిదాయకమై వ్యక్తి, సిలికాన్ వ్యాలీలో అత్యంత గౌరవనీయులైన టెక్ విజనరీ శంతను నారాయణ్ గారిని కలవడం భావోద్వేగమైన అనుభూతి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు.
ప్రపంచానికి హైదరాబాద్ అందించిన ప్రసిద్దుల్లో ఒకరు శాంతను నారాయణ గారు అని సీఎం పేర్కొన్నారు.
Comments