సొంత గూటికి చేరిన మాజీ జడ్పీటీసీ కరునసాగర్ రావ్.
By
Rathnakar Darshanala
సొంత గూటికి చేరిన మాజీ జడ్పీటీసీ కరునసాగర్ రావ్.
*40 సంవత్సరాల రాజకీయంలో మచ్చలేని నాయకుడిగా గుర్తింపు*.
చెన్నూరు రూరల్ నేటివార్త ఆగస్ట్ 21
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణానికి చెందిన మాజీ జడ్పీటీసీ కరునసాగర్ రావ్ బుధవారం రోజున చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కరునసగర్ రావ్ మాట్లాడుతూ తన తండ్రిగారైన బెల్లంకొండ జగన్నాథరావు కాకా వెంకటస్వామి కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉండేదని, అప్పటినుండి మా కుటుంబం వెంకటస్వామి కుటుంబం కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయ ప్రస్థానం మొదలైందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో సర్పంచి నుండి జడ్పీటీసీ వరకు పదవులు చేపట్టానని నిస్వార్థంగా ప్రజలకు అనేక సేవలు చేశానని, 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎటువంటి అవినీతికి పాల్పడలేదని ప్రజలకు సేవచేయడమే అదృష్టంగా భావించె వాడినని తెలిపారు.
కొన్ని రాజకీయ పరిణామాల దృష్ట్యా బీఆర్ఎస్ లో చేరానన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో సొంత ఇంటికి చేరినట్లు ఉందని పేర్కొన్నారు. వీరితో పాటు ముగ్గురు మాజీ సర్పంచులు,
ఆస్నాద్ ఉపసర్పంచ్ నస్కురి శ్రీనివాస్ చాకేపల్లి, ఒత్కులపల్లి, గంగారం, పొన్నారం, బాబురావుపెట్, సుద్దాల, సోమన్ పల్లి,నాగపూర్. గ్రామాల వార్డు మెంబర్లు 200 మంది కార్యకర్తలు పార్టీలో చేరారు.
Comments