ఇది కాలువ కాదు....కాలనీ..!
By
Rathnakar Darshanala
ఇది కాలువ కాదు....కాలనీ..!
*వర్షం పడిన ప్రతిరాత్రి జాగరనే*
*ఇల్లలోకి చేరుతున్న మురుగు నీరు*
చెన్నూరు రూరల్ నేటివార్త ఆగస్టు 8 :
చినుకు పడితే చాలు గ్రామంలోని కొన్ని వీదుల ఇండ్లు మురుగునీటితో నిండిపోతున్నాయి. దీనితో గ్రామ ప్రజలు అనేక వ్యాధుల భారిన పడి ఆస్పత్రుల పాలు అవుతున్నారు.
వివరాల్లోకి వెళితే చెన్నూరు మండలం లోని ఆస్నాద్ గ్రామంలో సరైన డ్రైనేజీలు లేక వర్షం పడిన ప్రతీసారి అనేక వీదులలోని ఇళ్లలోకి మురుగు నీరు చేరి దుర్గంధం వెదజల్లుతుంది.
మురుగునీటితో పాటు పాములు, కప్పలు రావడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.
మురుగు నీటి వలన ప్రజలు అనారోగ్యం పాలు అవుతున్నారు ఇప్పటికి చాలా మంది జ్వరంతో ఆసుపత్రుల చుట్టు తిరుగుతున్నారు.
గ్రామంలోని మంగళిబజారు, ఇంగిలివాడ, బస్టాండు ప్రాంతాలలోని ప్రజలు వర్షం పడిన ప్రతీసారి తమ ఇల్లనుండి బయటికివచ్చి పక్క ఇళ్లలో తలదాచుకుంటు ఇలా కొన్ని సంవత్సరాలుగా బతుకుజీవుడా అంటూ కాలం వెళ్ళదీస్తున్నారు.
ఇకనైనా సంబంధితి అధికారులు స్పందించి మా సమస్యలకు పరిష్కారం చూపగలరని పలు కాలని వాసులు అదికారులను వేడుకుంటున్నారు.
Comments