Adilabad :దళితుల భూమి స్వాహాకు ప్రయత్నం చేస్తున్న రియల్ మాఫియా.
By
Rathnakar Darshanala
Adilabad :దళితుల భూమి స్వాహాకు ప్రయత్నం చేస్తున్న రియల్ మాఫియా.
* వారసులు లేని భూమి తమ పేరుపై మోటేషన్ చేయమని మున్సిపల్ అధికారులపై ఒత్తిడి
* సరైన పత్రాలు లేకుండా మోటేషన్ కు దరఖాస్తులు
* రంగంలో ఒక రాజకీయ నాయకుడు ఉన్నట్లు ప్రచారం
నేటి వార్త జిల్లా ప్రతినిధి అదిలాబాద్ :
ఆదిలాబాద్ పట్టణం వినాయక చౌక్ లోని సర్వే నెంబరు 400 పహానీలలో నీరటి పోచిరామ్ పేరు పై గత 55 సంవత్సరాలుగా రెవెన్యూ రికార్డ్ లో నమోదు అయి ఉన్నది .దాంతోపాటు ప్రస్తుతం ధరణిలో ఉన్న పహానిలో, ఫామ్ 1 బి లో, ఫారం 7 లో, మరియు సేతు వార్ వంటి రెవెన్యూ రికార్డుల్లో ఇదే పేరు నమోదయి ఉన్నది .
ఈ భూమిని ఇటీవల తమకు ఎటువంటి సంబంధం లేని కొందరు వ్యక్తులు తమ పేరుపై ముటేషన్ చేయవలసిందిగా ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్ ను మున్సిపల్ అధికారులకి సమర్పించారు .
వారు మున్సిపల్ అధికారులకు సమర్పించిన పార్టేషన్ డాక్యుమెంట్లో సర్వే నెంబరు 400 ఎక్కడా మెన్షన్ లేదు. మరియు 1958 లో తాము పియటోడ సన్నాఫ్ పోచ్చిగా అనే పేరుపై తమ తండ్రి కొనుగోలు చేశాడంటూ వారు పేర్కొంటున్నారు.
కానీ పీయటోడకు ప్రస్తుతం 1955 నుండి వస్తున్న పో చ్చిరాంకు ఎటువంటి సంబంధం లేదు. సంబంధం లేని వ్యక్తుల వద్ద 1958 లో కొనుగోలు చేసినట్లు సృష్టించిన డాక్యుమెంట్లను మున్సిపల్ అధికారులకు చూపెడుతున్నట్టు తెలిసింది. మరియు గతంలో వీరు మోటేషన్ ఇదే ఇంటి నెంబరు తో నాలుగు డిఫరెంట్ సర్వే నెంబర్లలో కూడా పార్టిషన్ డీడ్ చేసుకున్నట్టు ఉన్నది.
మరియు ఈ సర్వే నెంబర్ ను రెవెన్యూ రికార్డులో ఇప్పటివరకు అగ్రికల్చర్ ల్యాండ్ నుండి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ గా మార్చలేదు మరియు లక్షలాది రూపాయలు నాలా ఫీజు చెల్లించాల్సి ఉన్నా చెల్లించకుండా మోటే షన్ కు అప్లై చేయటం దీనిపై మున్సిపల్ అధికారులు ఎటువంటి వివరాలు దరఖాస్తుదారులను ఆడగక పోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.
మరియు గతంలో ఈ భూమిని వివాదాస్పద భూమిగా జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ గుర్తించి ఇట్టి భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశాలు ఇచ్చారు. అధికారులు అందరూ మారిన తర్వాత సంబంధిత వ్యక్తులు కొత్త నాటకానికి తెరలేపారు.
మున్సిపల్ అధికారులు కూడా ప్రస్తుతం రెవెన్యూ రికార్డులో ఉన్న పేర్లను పరిశీలించకుండా 60 ఏళ్ల కిందట తయారుచేసిన నిజమైనదో నకిలీదో తెలియని ఒక డాక్యుమెంటు ఆధారంగా కోట్లాది రూపాయల విలువ చేసే భూమిని దరఖాస్తుదారులకు కట్టబెట్టే ప్రయత్నం చేయటం పట్ల పలువురు నిరసిస్తున్నారు.
ఈ మేరకు సంబంధిత కౌన్సిలర్ మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఒకవేళ నిజంగా దరఖాస్తుదారులు ఈ భూమిని కొనుగోలు చేసినట్లయితే ఈ భూమి1959 నుండి ఇప్పటివరకు రెవెన్యూ రికార్డులో మోటేషన్ ఎందుకు కాలేదు
మరియు ఇప్పటివరకు మున్సిపల్ రికార్డులో ఈ సర్వే నెంబర్ లొ ఒక్క గుంట భూమి కూడా ఎందుకు మోటిషన్ చేయలేదు .గతంలో అప్పటి కమిషనర్ మారుతి ప్రసాద్ పొరపాటున చేసిన మోటేషన్ను ఎందుకు రద్దు చేశారు.
అనే విషయాన్ని మున్సిపల్ అధికారులు పరిగణలోకి తీసుకోవటం లేదు. కనీసం సబ్ రిజిస్టర్ కార్యాలయానికి ,మరియు జిల్లా కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్కు కు సంభదించిన వారు సమర్పించిన కాలం చెల్లిన డాక్యుమెంట్లు ఆయా కార్యాలయాలనుంచి ఇష్యూ చేసినవేనా అనే విషయం కూడా పట్టించుకోవడం లేదు.
దీని వెనుక జిల్లా కేంద్రంలోని ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి హస్తము ఉన్నట్లు తెలుస్తుంది అతనే మున్సిపల్ అధికారులను ప్రభావితం చేస్తూ ఎలాగైనా సరే ఈ మోటేషన్ చేయండి అని రహస్య ఆదేశాలు సంకేతాలు ఇస్తున్నట్లు తెలిసింది .
ఈ విషయంపై ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు సంబంధిత సబ్ రిజిస్టర్ కార్యాలయం కు, మరియు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి లేఖలు రాసి వివరణ తీసుకోవాలని మరియు ప్రస్తుత పహానిలోనే నమోదైన సర్వేనెంబర్ 400 యజమాని దరఖాస్తుదారుల తండ్రికి ప్రస్తుత పహాని లో ఉన్న వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడా అనే విషయం తెలుసుకోవాలని ,
ఒకవేళ ఆయనే దరఖాస్తు చేస్తే గత 50 సంవత్సరాలుగా రెవెన్యూ అధికారులు పహానిల్లో మోటేషన్ ఎందుకు చేయలేదు అనే విషయంపై దర్యాప్తు జరపాలని,
మరియు రిజిస్టర్ చేసిన వ్యక్తి పీయటోడ మరియు ప్రస్తుత పహాని లో ఉన్న వ్యక్తి పొచ్చిరాం రెండు పేర్లకు సంబంధం లేదన్న విషయాన్ని మరిచిపోయి మునిసిపల్ అధికారులు ప్రవర్తిస్తున్నారని సంబంధిత కౌన్సిలర్ ఆరోపించారు.
దరఖాస్తుదారుల కబ్జాలో ఉన్న భూమి సుమారు ఐదు ఎకరాల 20 గుంటలు ఉండగా అందులో సుమారు రెండు ఎకరాలు ప్రభుత్వ స్థలం ఉన్నట్లు పలువురు పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.
గతంలో వీరి ఆక్రమణంలో ఉన్న స్థలాన్ని కొలిపిస్తే ఐదెకరాల 20 గుంటలు వచ్చినట్లు తెలిసింది .కాగా అది స్వాధీనం చేసుకునే ప్రక్రియ అప్పటి జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ బదిలీతో ఆగిపోయింది .
కాబట్టి ఇప్పటికైనా పూర్తి వివరాలతో అన్ని శాఖల సహకారంతో పూర్తి దర్యాప్తు జరిపి దరఖాస్తుదారులే ఈ స్థలానికి సంబంధించిన హక్కు దారులుగా రెవెన్యూ రికార్డులో నమోదైన తర్వాతే ఎటువంటి మోటేషన్లు అయినా చేయాలని కౌన్సిలర్ తెలియజేశారు.
కాగా పొచ్చిరామ్ కి సంబంధించిన చట్టబద్ధ వారసులు తగిన సాక్షాదారులతో హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది.
Comments