ఓపెన్ పది, ఇంటర్ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.

Rathnakar Darshanala
ఓపెన్ పది, ఇంటర్ ప్రవేశాల షెడ్యూల్ విడుదల
నిజామాబాద్ విద్యావిభాగం  తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ 2024-25 

నేటి వార్త / నిజామాబాద్ అర్బన్ ఆగస్టు 7 
విద్యాసంవత్సరానికి పది, ఇంటర్ లో ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసినట్లు డీఈవో దుర్గాప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

ఈ నెల 8 నుంచి వచ్చేనెల 10 వరకు సాధారణ రుసుంతో ఫీజు, సెప్టెంబరు 11 నుంచి అక్టోబరు 3 వరకు పదోతరగతిలో ప్రవేశానికి రూ.100, ఇంటర్ లో రూ.200 అపరాధ రుసుంతో ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.

 పూర్తి వివరాలకు ఉమ్మడి జిల్లా సమన్వయకర్త రవీందర్ (8008403518, 9849234696) ను సంప్రదించాలని సూచించారు.
Comments