రైతులు చదును చేస్తున్న భూమిని అడ్డుకున్న అటవీశాఖ అధికారులు.

Rathnakar Darshanala
రైతులు చదును చేస్తున్న భూమిని అడ్డుకున్న అటవీశాఖ అధికారులు.
నేటి వార్త, ధర్మసాగర్:

 హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూరు ఇరుపరాతి గట్లలో సర్వేనెంబర్ 531 లో గల భూమిని శనివారం సంబంధిత రైతులు చదును చేస్తుండగా అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. 

ఇనుపరాతి గట్ల సమీపానగల భూములను ప్రభుత్వం రిజర్వు ఫారెస్ట్ భూములుగా ప్రకటించిందని వాటిలో సేద్యం చేయకూడదని రైతులకు తెలిపారు. 

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొందరు వ్యక్తులు ఈ భూములను పట్టా చేసుకొని రైతుబంధు కూడా అనుభవించారని కేవలము మాలాంటి నిరుపేద రైతులకు సేద్యం చేసుకుని బ్రతుకుదామంటే సేద్యం చేయకుండా అటవీశాఖ అధికారులు అడ్డుకోవడం చాలా బాధాకరమైన విషయమని  

ఒకవేళ ఈ భూములను ప్రభుత్వము ఫారెస్ట్ ల్యాండ్ గా ప్రకటిస్తే హద్దులు నిర్ణయించి మిగతా భూములను వారసత్వంగా పట్టాలు కలిగియున్న వారికి భూములు వర్తించేలా చర్యలు చేపట్టాలని,

ఒకవేళ రిజర్వ్ ఫారెస్ట్ గా ఆ భూములను ప్రకటిస్తే మాకు మరొకచోట వ్యవసాయం చేసుకొనుటకు స్థలము చూపించాలని ఫారెస్ట్ అధికారులకు విన్నవించారు. 

ఈ కార్యక్రమంలో భూ సంబంధిత బాధిత రైతులు తదితరులు పాల్గొన్నారు.
Comments