గురుపూర్ణిమ - వేద వ్యాసుడు. ప్రత్యేకత.

Rathnakar Darshanala
గురుపూర్ణిమ - వేద వ్యాసుడు. ప్రత్యేకత.
ఆదిలాబాద్ బ్యూరో నేటి వార్త :

వ్యాసుడు పేరు మీద గానే ఆషాడ మాసంలో వచ్చే పున్నమి ని వ్యాస పూర్ణిమ అంటారు. దీనినే గురు పూర్ణిమ గా వ్యవహరిస్తారు.

మనకు విద్య నేర్పిన గురువులను స్మరించుకుంటూ సమస్త వేదాలను ఇతిహాసాలను అందించిన వ్యాసభగవానుడికి పూర్ణిమ రోజున ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటాం. 

వ్యాస పూర్ణిమ అంటే కచ్చితంగా వ్యాస మహర్షిని  మాత్రమే తలుచుకుని పూజలు అర్పించవలసిన రోజు. నమస్తే లోకాలకు వ్యాసుడు చూపించిన మార్గం అద్భుతం
 సకల శాస్త్రాన్ని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారు.

 సప్త చిరంజీవుల్లో ఒకరు 
బదరీ వనంలో తపస్సు చేసుకున్నాడు కాబట్టి ఆయన కార్య క్షేత్ర కేంద్రం అది కాబట్టి ఆయనను బాదరాయణుడు అని పిలుస్తారు. భారతదేశంలో ఉన్న వేద విజ్ఞానం ప్రస్తుతం మనకు లభిస్తోంది అంటే అందుకు కారణం వ్యాసులవారే. 

మనం అందరం  బాదరాయణ అంటే వేదవ్యాసులతో సంబంధాన్ని కలిగి ఉన్నవారము.. అందరమూ బాదరాయణ సంబంధీకులం అని అర్థం.
వేదాలను నాలుగు భాగాలుగా విభజించి హైందవ సాంప్రదాయంలో కృష్ణద్వైపాయుడుగా పిలువబడే వాడు వ్యాసుడు. వేదాలను విభజించడం వల్ల
 వేద వ్యాసుడయ్యాడు.

 వేదాలతో పాటు మహాభారతం, మహాభాగవతంతో పాటు అష్టాదశపురాణాలు రచించాడు వ్యాసుడు. వ్యాసుడు సప్తచిరంజీవులలో ఒకరు 
 ఒకే రాశిగా ఉన్న వేదాలను వ్యాసులవారు  విభజించి ఋగ్వేదము,యజుర్వేదము, సామవేదము, ఆధర్వణ వేదము అని  నాలుగు వేదాలుగా ఏర్పరిచారు.

 అందుకే వారిని వేద వ్యాసః అన్నారు వ్యాసః అంటే విభజించిన వారు అని అర్థం.  అష్టాదశ పురాణాలు, ఉపనిషత్తులు, భారత భాగవతాలు వీటన్నింటికీ వేదవ్యాసుడే కర్త

ఈ విధంగా భారత దేశంలో ప్రస్తుతం ఉన్న విజ్ఞానానికి అంతటికీ మూలం వేదవ్యాస మహర్షి . 
.. ఈ జగత్తులో ఉన్న విజ్ఞానం అంతా వేదవ్యాసుని ద్వారా వెలువడింది అని అర్థం.. 

ఈ విధంగా ప్రస్తుతం జీవించి ఉన్న మనమందరం వేదవ్యాసుల వారు రాసిన ఏదో ఒక మంత్రము... ఏదో ఒక శ్లోకము కచ్చితంగా చదువుకుంటూనే ఉంటాం..

 వ్యాస పూర్ణిమ / గురు పూర్ణిమ నాడు వేదవ్యాస మహర్షి స్మరించుకుని వేదాల సారాంశాన్ని ఉపనిషత్తుల సారాంశాన్ని భాగవతాన్ని భారతాన్ని పూర్తిగా చదవలేకపోయినా అందులో కొంత సారాన్ని శరీరానికి అందిస్తే ఈ మానవ జీవితాలు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మహోన్నతంగా ఎదుగుతాయి.

వ్యాసుడు వశిష్టుని మనవడు మరియు శక్తి యొక్క మనవడు. అతను పరాశరుని కుమారుడు మరియు శుక మహాముని తండ్రి. సర్వ దోషములు లేనివాడు, తపస్సుల గని అయిన ఆ వ్యాసునికి నా ప్రణామం
 గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ గా మాత్రమే స్మరించాలి.

Comments