అధిక వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండండి.

Rathnakar Darshanala
అకాల వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండండి.
*భూత్పూర్ మున్సిపాలిటీ  చైర్మన్ బస్వరాజ్ గౌడ్* 

మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా బ్యూరో /నేటి వార్త న్యూస్/ జూలై 20 

గత మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా భూత్పూర్ మున్సిపాలిటీ ప్రజలు, పరిసర గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు పాటించాలని భూత్పూర్ మున్సిపాలిటీ చైర్మన్ బస్వరాజ్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.

 గత మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల  వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

ఈ అకాల వర్షాల కారణంగా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించండని, ముఖ్యంగా శిథిలావస్థలో ఉండి కూలిపోయే పరిస్థితిలో ఉన్న ఇండ్లలో ఉండేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని,

అత్యవసర పరిస్థితి ఏదైనా ఉంటే మున్సిపల్ అధికారులను సంప్రదించాలని ,
నిరంతరంగా వర్షాలు కురుస్తున్న సందర్భంగా పట్టణ ప్రాంతాల్లో, పరిసర గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,

చెరువులు కుంటల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, నీటి ప్రవాహం ఉన్నచోట రాకపోకలపై దృష్టి సారించాలని, పశువులు,

 గొర్రెలు ,వాగులు దాటే క్రమంలో వరద ఉదృతిని అంచనా వేసి వాటిని జాగ్రత్తగా దాటించాలని దాటించాలని,ముఖ్యంగా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఉన్నచోట జాగ్రత్త ఉండాలని,

ఏదైనా సహాయం కావాలనుకున్న వారు స్వయంగా లేదా ఫోన్ ద్వారా సమస్యను తెలపాలని 
 భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్ గౌడ్  ఒక ప్రకటనలో తెలిపారు.
Comments