అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు.
By
Rathnakar Darshanala
అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు.
జెసిబి ని సీజ్ చేసిన ఫారెస్ట్ అధికారులు.
నేటి వార్త పెద్దపల్లి ప్రతినిధి జులై 14 ఆడిచర్ల రమేష్
పెద్దపల్లి మండలంలోని గౌరెడ్డి పేట గ్రామ శివారులోని ఫారెస్ట్ ల్యాండ్ నుండి కొందరు అక్రమార్కులు గత కొన్ని రోజులుగా ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతి లేకుండా ప్రభుత్వ ఆదాయానికి గడ్డి కొడుతూ,
జెసిబి ల ద్వారా సహాయంతో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతూ టిప్పర్ల ద్వారా అక్రమంగా మట్టి తరలిస్తున్నారని సమాచారము మేరకు ఫారెస్ట్ అధికారులు శనివారము తెల్లవారుజామున సుమారు 3:00 గంటల ప్రాంతంలో జెసిబిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఫారెస్ట్ అధికారులు.
చట్టం ప్రకారము కేసు నమోదు చేశామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నాగయ్య తెలిపారు. అయితే అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి పట్టుబడ్డ జెసిబిని విడిచి పెట్టాలని అధికారులతో సంప్రదింపులు జరుగుతున్నట్టు సమాచారం.
ఫారెస్ట్ ల్యాండ్ లో అక్రమంగా భట్టి నవ్వుతున్న నిర్వాహకులు ఇప్పటికే మూడుసార్లు ఫారెస్ట్ అధికారులు జెసిబి ని పట్టుకున్నట్లు అన్నారు. ఫారెస్ట్ అధికారులు ఎటువంటి చర్యలు చేపడతారో...? వేచి చూడాలి..! పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.
Comments