రాయికల్ లో వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు.

Rathnakar Darshanala
రాయికల్ లో వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు.
నేటివార్త రాయికల్ జూలై 14:

రాయికల్ పట్టణంలో ఆదివారం రోజు పద్మశాలి సేవ సంఘం,యువజన సంఘం, పోపా,మహిళ సంఘాల ఆధ్వర్యంలో బోనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

మార్కండేయ దేవాలయం నుండి గాంధీ విగ్రహం,బస్టాండ్ మీదుగా పోచమ్మ గుడి వరకు మహిళలు బోనాలతో వచ్చి అమ్మ వారికి బోనాలు సమర్పించారు.సుమారు 200 బోనాలతో అమ్మ వారికి మొక్కు తీర్చుకున్నారు. 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు, బిజెపి జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ భోగ శ్రావణి,యువజన సంఘం అధ్యక్షుడు సామల సతీష్,

మ్యాకల అనురాధ రమేష్, తాటిపాముల విశ్వనాథం,సంఘ నాయకులు,పెద్దలు, మహిళలు,కుల బాంధవులు పాల్గొన్నారు.
Comments