తెలంగాణ పాఠశాలలో టైమింగ్ లో మార్పులు.

Rathnakar Darshanala
తెలంగాణ పాఠశాలలో టైమింగ్ లో మార్పులు.
హైదరాబాద్ నేటి వార్త జులై 20 :

తెలంగాణ పాఠశాలల టైమ్ టేబుల్ ను మారుస్తూ తెలంగాణ విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రాథమిక పాఠశాలల సమయానికి అనుగుణంగా ఉన్నత పాఠశాలల్లో సమ యాన్ని మార్చారు. 

ఇప్పటి వరకు ఉన్నత పాఠశాలల పనివేళలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు ఉండగా… 

తాజాగా ఇప్పుడు ఉన్నత పాఠశాల సమయాన్ని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు మారుస్తూ ఉత్తర్వు ల్లో పేర్కొన్నారు.

అయితే, హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టు కొని ప్రస్తుతం అమలులో ఉన్న పని వేళలే కొనసాగు తాయని సూచించింది. 

దీంతో జంట నగరాల్లో ఉదయం 8.45 గంటల నుంచి సాయంత్ర నాలుగు గంటల వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి.ఈ మేరకు చర్యలు తీసు కోవాలంటూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలిచ్చారు..
Comments