ఇంజక్షన్ వికటించి...వ్యక్తి మృతి.
By
Rathnakar Darshanala
ఇంజక్షన్ వికటించి...వ్యక్తి మృతి.
నేటివార్త,కారేపల్లి(జులై 17):
సింగరేణి మండల కేంద్రంలో ప్రైవేట్ ఆసుపత్రి నిర్వహిస్తున్న ఎం బి బి ఎస్ డాక్టర్ సామినేని రాఘవులు వేసిన ఇంజక్షన్ వికటించి రేపాకుల లాలయ్య అనే వ్యక్తి మృతి చెందాడు.
గత కొంతకాలం నుండి షుగర్ వ్యాధితో బాధపడుతున్నాడు.ఇటీవల ఆయన కాళ్లకు పుండ్లు కావటంతో కారేపల్లిలో ప్రైవేట్ ఆసుపత్రి నిర్వహిస్తున్న ఎంబిబిఎస్ డాక్టర్ సామినేని రాఘవులు లాలయ్యకు మొదటగా రెండు ఇంజక్షన్లు ఇచ్చాడు.
డోసు ఎక్కువ కావడంతో లాలయ్య ఇబ్బంది పడి అస్తవ్యస్తకు గురయ్యాడు.ఇంజక్షన్ రియాక్షన్ అయింది.ఆ ఇంజక్షన్ విరుగుడు కోసం మరో మూడు ఇంజక్షన్లు వేశారు.అయినప్పటికీ లాలయ్య మృతి చెందాడు.
డాక్టర్ వైద్యం వల్లనే లాలయ్య మృతి చెందాడని ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులు డాక్టర్ల సామినేని రాఘవలను అదుపులోకి తీసుకున్నారు.
Comments