ఓసీపీ-2 ప్రాజెక్ట్ లో భారీ ప్రమాదం... ఇద్దరు కార్మికులు మృతి.
By
Rathnakar Darshanala
ఓసీపీ-2 ప్రాజెక్ట్ లో భారీ ప్రమాదం... ఇద్దరు కార్మికులు మృతి.
-మట్టిలో కూరుకొని ఫిట్టర్, జనరల్ మజ్దూర్ మృతి
నేటి వార్త విలేకరి, రామగిరి జూలై17, కాపర్తి అభిలాష్:
సింగరేణి సంస్థ ఆర్జీ-3 డివిజన్ ఓసీపీ-2 ప్రాజెక్ట్ క్వారీ లో బుధవారం జరిగిన భారీ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
క్వారీ లో నార్త్ సైడ్ లో ట్రిప్ మెన్ షెల్టర్ భాగంలో గత మూడు రోజుల క్రితం క్వారీ నుండి వెళ్లే భారీ పైప్ లైన్ లీక్ అయ్యింది. దీనిని మరమ్మత్తు చేయడానికి భారీ కందకం తవ్వారు.
లీకేజ్ పైప్ లైన్ నీటిని అరికట్టడానికి ఈఈ పంప్ సెక్షన్ ఇంచార్జి తేజ ఆధ్వర్యంలో ఫిట్టర్ ఉప్పుల వెంకటేశ్వర్లు, జనరల్ మజ్దూర్ లు గాదం విద్యాసాగర్, ముదం సమ్మయ్య, ఎర్ర శ్రీనివాస్ రాజ్ లు నీటి పైప్ లైన్ బొదిగే లోకి దిగి పనులు నిర్వహిస్తున్నారు.
సుమారు 10 ఫీట్ల లోతుల్లో పనిచేస్తుండగా అనుకోని రీతిలో ఒకేసారి మట్టి కూలింది. ఈ క్రమంలో సెంటినరీ కాలనీ కి చెందిన సి2-199 క్వార్టర్ కి చెందిన ఫిట్టర్ ఉప్పుల వెంకటేశ్వర్లు, ఎస్టీ2-1316 కి చెందిన గాదం విద్యాసాగర్ మట్టి లో కూరుకొనిపోయి మృతి చెందారు.
అక్కడే ఉన్న ఇద్దరు మజ్దూర్ లు అయిన ఎస్టీ2-1793 కి చెందిన ముదం సమ్మయ్య, పెద్దపల్లి కి చెందిన ఎర్ర శ్రీనివాస్ రాజ్ లు తప్పించుకొనే క్రమంలో నడుము వరకు మట్టి కూరుకునిపోయి ప్రాణాపాయస్థితి నుంచి బయటపడ్డారు.
ఈ ప్రాంతంలో భారీ గుంత చుట్టు ఉన్న మట్టిని మధ్యాహ్నం 03.00 గంటల ప్రాంతంలో షావెల్ ఆపరేటర్ విద్యాసాగర్ తొలగించారు. ఈ ప్రాంతంలో నీటి లీకేజ్ తో మట్టి కుంగిపోవడం,
దీనికి తోడు వర్షం పడడం, పక్క నుండి భారీ వాహనాలు అయిన డంపర్లు నడుస్తుండడంతో మట్టి కుంగిపోయినట్లు సమాచారం. రక్షణ చర్యలు సరిగ్గా తీసుకోలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని కార్మిక సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు.
మృతదేహాలను, గాయపడ్డ ఇద్దరిని గోదావరిఖని ఏరియా హాస్పిటల్ కి తరలించారు. ప్రమాదం తెలుసుకున్న వెంటనే సెంటినరీ కాలనీ డిస్పెన్సరీ కి టిబిజికెఎస్ యూనియన్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి, ఆర్జీ-3 ఉపాధ్యక్షులు నాగెల్లి సాంబయ్య, సిఐటియు యూనియన్ నాయకులు దొమ్మాటి కొమురయ్య, గౌతం శంకరయ్య, తదితరులు చేరుకొని వివరాలను తెలుసుకున్నారు.
కొద్దీసేపటికే ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి ఆర్జీ-3 జిఎం నరేంద్ర సుధాకరరావు, ఆర్జీ రీజియన్ సేఫ్టీ జిఎం కందుకూరి హరినారాయణ గుప్తా లు చేరుకొని వివరాలు సేకరించారు.
Comments