Ap :చింతపల్లి కార్యదర్శి పంచాయతీ నిధులు దూర్వినియోగం.

Rathnakar Darshanala
చింతపల్లి కార్యదర్శి  పంచాయతీ నిధులు దూర్వినియోగం.
వడ్డించే వాడు మన వాడైతే 
ఏ మూలాన కూర్చున్న తినొచ్చు అన్న చందంగా గ్రామ పంచాయతీల పరిస్థితి.


కారంపూడి జులై 16 నేటివార్త :

కూటమి ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధి కోసం నూతన సంస్కరణలు తీసుకువస్తుంటే కొందరు పంచాయతీ కార్యదర్శిలు ప్రజాదనాన్ని దూర్వినియోగం చేస్తున్నారు. 

పంచాయతీ సొమ్ము ప్రజల జీవన స్థితుల మైరుగుపరచడానికా లేక కార్యదర్శిల విలాస జీవితం గడపడానికా అర్థం కానీ పరిస్థితి నెలకొంది. 

వివరాల్లోకి వెళితే
కారంపూడి మండలం, చింతపల్లి గ్రామ కార్యదర్శి రామరాజు 26-5-25 న విపి యఫ్ నిధులు సుమారుగా 4.16 లక్షలు గ్రామ సర్పంచ్కి, మండల పరిషత్ అధికారులకు తెలియకుండా  డ్రా చేసాడని మండల పరిషత్ అధికారి జి. శ్రీనివాస్ రెడ్డి మీడియాకు తెలియజేసారు.

సోమవారం నాడు జిల్లా పంచాయతీ అధికారికి రిజిస్టర్ పోస్ట్ ద్వారా జరిగింది వివరంగా పంపడం జరిగిందని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు  నిధుల దూర్వినియోగనికి పాల్పడిన కార్యదర్శిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 

ఇటువంటి సంఘటనలు ఈ పంచాయతీలోనే జరిగాయా లేక మిగతా పంచాయతీలలో కూడా జరిగాయో తెలియాలంటే జిల్లా డిఆర్ఓ, కలెక్టర్ నేతృత్వంలో కమిటీ వేసి విచారణ చేస్తేగాని మండలంలోని అన్ని పంచాయతీల నిజానిజాలు బయటరావనేది పొట్టోచినట్టు ఈ సంఘటన మూలాన అర్థం అవుతుంది.
Comments