మా నాన్న మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించండి.సీఎం గారు.చిన్నారుల ఆవేదన.
By
Rathnakar Darshanala
మా నాన్న మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించండి.సీఎం గారు... చిన్నారుల ఆవేదన.
నేటి వార్త/బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జీ జూలై 21 :
మెండోరా: మండల కేంద్రానికి చెందిన మాకూరి వినోద్ బతుకుదెరువు కోసం బెహరన్ దేశం వెళ్ళాడు అక్కడ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈనెల 17న ప్రమాదవశాస్తు మృతి చెందాడు.
వినోద్ మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తీసుకువచ్చేలా చూడాలని తన కూతురు, కుమారుడు, భార్య,రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
గత నాలుగు రోజుల నుండి తన మృతదేహం బెహ్రాన్లో ఉండిపోవడం జరిగిందని అధికారులు స్పందించి వెంటనే మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలని చిన్నారులు కోరుతున్నారు.
సీఎం గారు స్పందించాలని మా నాన్న మృత దేహం మాకు ఇప్పించండి అని కోరుతున్నారు.చిన్నారుల ఆవేదన పలువురిని కంటతడి పెట్టిస్తుంది.
Comments