సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
By
Rathnakar Darshanala
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
- మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్.
నేటి వార్త పెద్దపెల్లి టౌన్ జూలై 13 ఇనుగంటి సంతోష్ రావు.
పెద్దపెల్లి పట్టణంలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఈరోజు ఉదయం మున్సిపల్ పరిధిలోని పలు వార్డులో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ శానిటేషన్ పనులను పరిశీలించారు,
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలం దుష్ట సానిటేషన్ పనులను సక్రమంగా నిర్వహించాలని డ్రైనేజ్ లో చెత్త నిల్వలేకుండా చూడాలని నీరు నిల్వఉన్నచోట ఆయిల్ బాల్స్ వేయాలని మురికికాలువలు తీసిన వెంటనే బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని సానిటరీ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు.
కూరగాయల మార్కెట్ ని సందర్శించి అనంతరం మటన్ మార్కెట్ ప్రక్కన మరియు హోల్ సెల్ దుకాణాల ముందు సిమెంట్ గాజులు ఏర్పాటు చేయాలని మార్కెట్ యజమానులు మిగిలిన కూరగాయలను బయట పడేయకుండా అందులో వేసిట్లయితే మున్సిపల్ సిబ్బంది తీసుకవెళ్తారని అన్నారు,
ఈకార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శివప్రసాద్,సానిటరీ సూపర్ వైజర్ అనిల్,సానిటరీ ఇన్స్పెక్టర్లు రామ్మోహన్ రెడ్డి,పులిపాక రాజు,వార్డ్ ఆఫీసర్ భూమేష్,ఆల్కజవాన్లు జయరాజ్,మోహన్,వేణు,మేప్మా ఆర్పీ స్రవంతి, మెడికల్ ఆఫీసర్ మమత, ఏఎన్ఎం సరోజ,ఆశ వర్కర్ మరియమ్మ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments